దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్ల కంటే రమ్యకృష్ణ పోషించిన శివగామి రోల్ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. ఇక తమన్నా అవంతిక పాత్ర చేసింది. ఈ రెండు పాత్రలకు కూడా బాలీవుడ్ మార్కెట్ స్ట్రాటజీ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్లనే ముందుగా రాజమౌళి సంప్రదించారట. అవంతిక పాత్ర కోసం అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్‌ను అడిగారట.
అయితే ఆ పాత్రను ఆమె రిజెక్ట్ చేయడంతో చివరకు తమన్నాను ఓకే చేశారు. ఈ విషయాన్ని సోనమ్ నేహా ధూపియా టాక్ షోలో సోనమ్ స్వయంగా చెప్పింది. ఇక శివగామి పాత్ర కోసం శ్రీదేవిని అడిగితే ఆమె ఏకంగా రు. 8 కోట్లు డిమాండ్ చేశారట. అయితే నిర్మాతలు అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో ఆమె ఆ పాత్రను వదులుకుంది. చివరకు రమ్యకృష్ణ ఆ పాత్రను పోషించి.. శివగామీ దేవి అనే పాత్ర చరిత్రలో నిలిచిపోయేంత పెర్పామెన్స్ ఇచ్చింది.
ఈ విషయాన్ని రాజమౌళీయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అప్పట్లో రాజమౌళి ఇలా చెప్పడంపై హర్ట్ అయిన శ్రీదేవి తనను ఈ వ్యాఖ్యలు ఎంతో బాధించాయని చెప్పింది. తాను డబ్బు కోసం ఆశపడితే ఇన్నేళ్లలో ఎన్నో మంచి క్యారెక్టర్లు ఎలా చేస్తానని చెప్పింది.