తాప్సీ అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. వెంకటేష్ లాంటి పెద్ద హీరోల పక్కన అవకాశాలు వచ్చినా కూడా ఆమెకు ఎందుకో గాని స్టార్ డమ్ రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే తాప్సీనే గుర్తుకు వస్తోంది. పైగా కంగనా లాంటి వాళ్లు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నా… వివాదాలకు దూరంగా ఉండడం తాప్సీకి ఎప్పుడూ ప్లస్ అవుతుంది.
టాలీవుడ్లో ఆమె చివరిగా గేమ్ ఓవర్ సినిమాతో మాత్రమే ఇక్కడ కనిపించింది. ఇక తాప్సీ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మరో నాలుగైదేళ్లు ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ఆమె నటిస్తోన్న సినిమాలతో పాటు ఒప్పుకున్న సినిమాల లిస్ట్ చూస్తే ఐదారు వరకు ఉన్నాయి. మిగిలిన భాషల కన్నా ఆమె బాలీవుడ్లోనే బిజీబిజీగా ఉంది. ఆమె ఒక్కో సినిమాకు రు. 1.5 – 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తక్కువ రెమ్యునరేషన్‌తో మంచి పెర్పామ్ ఉన్న నటి కావడంతో కూడా ఆమెకు ఎక్కువ మంది ఛాన్సులు ఇస్తున్నారు.
ఇక ఆమె మొత్తం ఆస్తుల విలువ రు. 50 కోట్ల పై మాటే అని తెలుస్తోంది. ముంబైలోనే ప్లాట్ కొనుక్కుందట. ఆమె తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఇక్కడ కంటే బాలీవుడ్లోనే ఎక్కువ సంపాదించుకోవడంతో పాటు కాస్తంత కూడబెట్టుకుందట.