హీరో అవ్వాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ,అలా అనుకుని వదిలేస్తే ఎలా..?? అందుకు తగ్గ కృషి , పట్టుదల అన్ని ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న విజయం సాధిస్తారు. అలా కష్టపడి విజయాని అందుకునే వారు కొందరైతే.. చేతికి వచ్చిన అవకాశాని చేజార్చుకునేవారు మరికొందరు.
ఇటీవలకాలంలో మనం చూసినట్లైతే.. ప్రస్తుత హీరోలు ఒక సంవత్సరానికి ఒకటి , మహా అయితే రెండు సినిమాలను విడుదల చేస్తున్నారు. అప్పట్లో హీరోలు.. ఏడాదికి ఐదు, పది అంతకంటే ఎక్కువ సినిమాలు చేసిన సందర్భాలు అనేకం. కానీ ప్రస్తుత తరంలో కథానాయకులు.. సంవత్సరానికి ఒకటి, రెండు చిత్రాలు చేయడం గగనమైపోయింది.
ఒక్కొక్కసారి అదే పనిగా ఎక్కువకాలం పని చేస్తే మధ్యలో విరామం కావాలి అనిపిస్తుంది. విరామం తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలిసిపోయి అయి ఉండొచ్చు, కొద్ది రోజులు టెన్షన్ అంతా వదిలేసి మళ్లీ రిఫ్రెష్ అయి పని మొదలు పెడదామని అనుకుని ఉండొచ్చు, ఇంకేదైనా కారణం కూడా అయి ఉండొచ్చు. మన హీరోలు కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నో రోజులు బ్రేక్ తీసుకున్నారు.
ఒక్కోసారి తెలియకుండానే కొందరు హీరోల కెరీర్‌లో భారీ గ్యాప్ వచ్చేస్తుంటుంది. కథలు కుదరక ఓసారి.. కథలు ఉన్నా కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా మరికొన్నిసార్లు సినిమాలు చేయరు.. చేయకుండా ఉంటారు. అలా ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇంకొక సినిమా రిలీజ్ అయ్యే మధ్యలో ఎక్కువ కాలం బ్రేక్ తీసుకున్న కొందరు టాలీవుడ్ హీరోలు సినిమా సినిమాకు మధ్య తీసుకున్న భారీ గ్యాప్ ఎంతో ఓ సారి చూద్దాం..
అల్లు అర్జున్ : 618 రోజులు గ్యాప్ తీసుకున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా – అల వైకుంఠపురం లో
మహేష్ బాబు : అప్పట్లో అతిథి సినిమా చేసిన తర్వాత మూడేళ్ల పాటు మహేష్ సినిమాలు చేయలేదు. గౌతమ్ పుట్టాడని మూడేళ్లు కొడుకుతోనే ఆడుకున్నాడు. అలాగే ‘అతిథి’ 2007లో వస్తే ‘ఖలేజా’ 2010లో విడుదలైంది. ఈ రెండు సినిమాల మధ్య 1085 రోజుల గ్యాప్ ఉంది.
పవన్ కళ్యాణ్: 891 రోజులు గ్యాప్ తీసుకున్నాడు. జల్సా – కొమరం పులి
కళ్యాణ్ రామ్ : ఎప్పటికప్పుడు వరస సినిమాలు చేస్తుండే కళ్యాణ్ రామ్ కూడా 2010లో విడుదలైన ‘కత్తి’ సినిమా తర్వాత ‘ఓం’ 3D కోసం 980 రోజుల గ్యాప్ తీసుకున్నాడు. ఈ చిత్రం 2013లో విడుదలైంది.
రవితేజ: 678 రోజులు గ్యాప్ తీసుకున్నాడు. బెంగాల్ టైగర్ – రాజా ది గ్రేట్
NTR: ఈ నందమూరి యంగ్ హీరో చివరి సినిమా అరవింద సమేత 2018..ఇప్పుడు 2022 RRR సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
ప్రభాస్: మన డార్లింగ్ హీరో ప్రభాస్ చివరి సినిమా సాహో 2019 లో విడుదలైంది. ఇప్పుడు2022లో రాధే శ్యాం తో మన ముందుకు వస్తున్నాడు.