సీరియల్స్.. అనగానే మనకు గుర్తొచ్చేది మన ఇంట్లో ఆడవాళ్లు.. ఎందుకంటే.. వారే ఎక్కువ గా సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంకా రిటైర్ అయ్యి ఖాళీగా ఇంట్లో ఉన్న మగవారు కూడా కాలక్షేపం కోసం సీరియళ్లు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువ ఫాలోయింగ్ సీరియల్స్ కే ఉందని చెప్పవచ్చు.. బుల్లితెరలో ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఇప్పటికే పలు సీరియల్స్ ద్వారా టీవీ చానల్స్ కు ఎక్కువ టిఆర్పీ కూడా వస్తుంది అంతగా ఆకట్టుకుంటున్న .. ఈ సీరియల్స్ ప్రేక్షకులను టీవీల ముందు వాలిపోయేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం వెండితెర కంటే బుల్లితెర ఎక్కువ వేగంగా దూసుకెళ్తుంది. ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నా.. వాటి క్రేజీ మాత్రం విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం బుల్లితెర లో ప్రసారమయ్యే సీరియల్స్ సినిమాలకంటే ఎక్కువ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాయి. ఇప్పుడున్న సమాజంలో చాలామంది సీరియల్స్ కు బాగా అలవాటు పడ్డారు. కారణం సీరియల్స్ సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రసారం అవుతుండగా.. ఆ తర్వాత జరిగే ఎపిసోడ్ కు కాస్త సస్పెన్స్ గా మారగా.. ప్రేక్షకులందరూ సీరియల్స్ వైపే ఆసక్తి చూపుతున్నారు.
ఇక ఈ సీరియల్స్ కి పెద్ద ప్లస్ పాయింట్ వాటి టైటిల్స్. అయితే, కొన్ని సీరియల్ టైటిల్స్ చాలా బాగుంటాయి. మంచి అర్ధంతో వినడానికి చాలా బాగుంటాయి. అయితే మరికొన్ని సీరియల్స్ లో సీరియల్ టైటిల్ కి కధకి అసలు సంబంధం ఉండదు. చిత విచిత్రంగా పేర్లు పెట్టి.. కధకు సంబంధం లేకుండా.. ప్రసారం చేస్తుంటారు. మరి కొన్ని సీరియల్స్ అయితే అప్పటికి బాగా హిట్ అయిన సినిమా పేర్లు పెట్టుకునేస్తారు. అలా ఏ సీరియల్ కు ఏ సినిమా పేరు పెట్టారో ఇప్పుడు చూద్దాం..
శ్రీమంతుడు-ETV
అభిషేకం-ETV
కార్తీక దీపం-Star Maa
అదుర్స్ – ETV dance show
అత్తారింటికి దారేది- ETV
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – ETV
గోకులంలో సీత – ETV
సావిత్రి – ETV
స్వాతి చినుకులు – ETV
జబర్దస్త్ – ETV comedy show
ఆరాధన – ETV