Newsఅక్కడ కండోమ్స్ దొరకడం అసాధ్యం... ఎందుకో తెలుసా..?

అక్కడ కండోమ్స్ దొరకడం అసాధ్యం… ఎందుకో తెలుసా..?

ఉత్తర కొరియా.. ఈ దేశం పేరు వినగానే చెవులు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే.. అది మన భూమిపైనే ఉన్నా మరో ప్రపంచం. చైనా, దక్షిణ కొరియాల మధ్య ఉన్న చిన్న దేశమే ఉత్తరకొరియా. ఈ ప్రపంచంలో బాగా అణచివేతతో కూడిన దేశాల్లో ఉత్తరకొరియా కూడా ఒకటని సాక్షాత్తూ మానవ హక్కుల పరిశీలన వేదిక నొక్కి చెప్పింది, అక్కడి ప్రజలకు ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అంతర్జాతీయ వార్తలపై అవగాహన ఉండదు. కేవలం వారికి వారి అధ్యక్షుడు గురించి మాత్రమే తెలుసు. ఆ దేశంలో జరిగే అరాచకాల గురించి తెలుసుకుంటే.. అది అసలు మనుషులు నివసించే ప్రాంతమేనా? మానవ హక్కులంటూ ఉన్నాయా అని ప్రశ్నించడం ఖాయం.

తప్పు చేసిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను లేబర్ క్యాంపులకు పంపడం ఇక్కడ చూడొచ్చు. ఈ కేంద్రాల్లోనే హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, బలవంతపు గర్భస్రావాలు, లైంగిక వేధింపులు సర్వసాధారణం. ఇక్కడ నిర్బంధించిన వారి జీవితం ఇక్కడ ముగిసిపోవాల్సిందే.

 

ఒక వ్యక్తి నేరం చేస్తే మూడు తరాల వారు శిక్ష అనుభవించాలి. నేరం చేసిన వ్యక్తి, అతడి వారసులు, వారసుల సంతానం వరకు కారాగార క్యాంపుల్లో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఈ తరహా నిబంధన మరెక్కడా లేదు. కఠిన చట్టాలను అమలు చేసే ఉత్తర కొరియాలో ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింత వింత ఆంక్షలు కనిపిస్తుంటాయి. మరి అవేంటో ఓ లుక్కేయండి.

కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్రజలు ఎవరూ కూడా దుస్తులు ధరించకూడదు. బట్టల విషయంలో కిమ్ ప్రభుత్వం చాలా సీరియస్గా వ్వవహరిస్తుంది. పాశ్చాత్యపోకడలకు ఆ దేశం కొంచెం దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఆ దేశంలో జీన్స్ లకు అనుమతి ఇస్తున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో కూడా ఉత్తర కొరియాలో బ్లూకలర్ జీన్స్ ధరించకూడదు. ఎందుకంటే ఆ రంగు అమెరికాను సూచిస్తుందట. అమెరికా అంటే కొరియాకు అస్సలు పడదు. ఇక్కడ వేసుకునే దుస్తులను పరిశీలించడానికి ఫ్యాషన్ పోలీసులు కూడా ఉంటారు.

అమ్మాయిలకు చాలా ముఖ్యమైన శానిటరీ ప్యాడ్లు, టాంపన్లపై కూడా నార్త్ కొరియాలో నిషేధం ఉంది. ఇక్కడి మహిళలు ఇప్పటికీ రీయూజబుల్ ప్యాడ్లనే ఉపయోగిస్తుంటారు.

ఉత్తర కొరియా వెళ్లి అక్కడ ఏవైనా బ్రాండెడ్ షూస్ కొనుక్కుందాం అనుకుంటే అయిపోయామే. ఇక్కడ ఎటువంటి డిజైనర్ షూస్ దొరకవు. వాటిపై కూడా బ్యాన్ ఉంది.

ఉత్తర కొరియాలో మీకు ఇష్టమైన జుట్టు కత్తిరించుకోలేరు. ప్రజల జుట్టు కత్తిరింపుల కోసం ప్రభుత్వం కొన్ని డిజైన్లను విడుదల చేసింది. ఉత్తర కొరియాలో నివసించే ప్రజలు ఈ డిజైన్లలో ఒకదాన్ని ఇష్టపడటం ద్వారా జుట్టు కత్తిరించుకోవచ్చు.

ఉత్తర కొరియాలో సాధారణ పౌరులు ఇక్కడ కార్లు కొనలేరని ఒక చట్టం ఉంది. సైన్యం మరియు ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇక్కడ కార్లను ఉంచడానికి అనుమతిస్తారు.

నార్త్ కొరియాలో బర్త్ కంట్రోల్‌కు సంబంధించిన అన్ని విధానాలపై నిషేధం ఉంది. దీంతో ఇక్కడ కండోమ్స్ దొరకడం అసాధ్యం. అందుకే ఇక్కడి మగవాళ్లకు ఎవరైనా సీక్రెట్‌గా కండోమ్ ప్యాకెట్లు బహుమతిగా ఇస్తే చాలా సంతోషిస్తారట. శృంగారం చేసేటప్పుడు సుఖ వ్యాధులు సోకకుండా ఉండేందుకు చాలా మంది కండోమ్ వినియోగిస్తుంటారు. సురక్షిత శృంగారం మాత్రమే కాకుడా గర్భం దాల్చకుండా ఉండేందుకు కూడా కండోమ్‌ను వాడుతుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news