గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం వేలాది వాహనాలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరగడం.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు పలువురు స్టార్ హీరోలు, సెలబ్రిటీలతో వాహనదారుల సురక్షిత ప్రయాణానికి సంబంధించిన ఎన్నో వీడియోలు రూపొందించడం, సందేశాలు రిలీజ్ చేయించడం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వచ్చే వాటికి మీమ్స్ రూపొందించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.
తాజాగా రామ్‌చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ అయ్యింది. బైక్‌పై రామ్‌చరణ్ , ఎన్టీఆర్ వెళుతున్న పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే సైబరాబాద్ పోలీసులు రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఫేస్‌లకు హెల్మెట్ యాడ్ చేశారు. మీరు హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయండని ఈ ఫొటోను కూడా వారు తమ ప్రచారానికి వాడుకున్నారు.
ఈ ఫొటోకు వారు చేసిన మార్ఫింగ్ మామూలుగా లేదు. వెంటనే దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో జోరుగా వైరల్ అవుతోంది. దీనికి ఆర్ ఆర్ ఆర్ టీమ్ కూడా స్పందించింది. ఇప్పటకీ పర్ఫెక్ట్గా లేదు. నెంబర్ ప్లేట్ మిస్ అయ్యింది అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.