హీరోలకు నట వారసులు ఉండటం సర్వసాధారణం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట వారసులు తెరంగ్రేటం చేయడం సహజమే. ఇలా వారసులుగా వచ్చి హీరోగా సెటిలైన వారు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ తో మొదలుకుని చిరంజీవి దాకా అందరూ తమ బిడ్డలను ఓ స్థాయికి తీసుకెళ్లిన వాళ్లే. ఇక్కడ అభిమానుల అందండలతో పాటు స్వంత టాలెంట్లు కూడా వాళ్ళకంటూ ఒక ఇమేజ్ రావడానికి దోహదపడ్డాయి. సినీ పరిశ్రమలో నట వారసులు చాలా మంది ఉన్నారు.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా. అయితే తాజాగా సూపర్ స్టార్ మేనల్లుడు అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అలా చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అలా వెండితెరపై వెలిగిపోతున్న టాలీవుడ్ హీరోల మెనల్లుళ్ల ఎవరెవరున్నారో ఒకసారి చూద్దాం.
చిరంజీవి- సాయి ధరమ్ తేజ్:
సాయి ధరమ్ తేజ్.. “మెగాస్టార్” చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు. తను వై.వి.ఎస్. చౌదరి “రేయ్” సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన, “పిల్లా నువ్వులేని జీవితం” సినిమాతో తెరంగేట్రం చేసాడు.
చిరంజీవి-వైష్ణవ్ తేజ్:
పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2020లో ఉప్పెన సినిమా ద్వారా హీరోగా మారాడు. వైష్ణవ్ తేజ్ జానీ, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., అందరివాడు చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. సాయి ధరంతేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
నాగార్జున-సుశాంత్ :
నాగార్జున మేనల్లుడు టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్. చి ల సౌ తో మంచి హిట్ సంపాదించుకుని ఇప్పుడు మరో వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అల్లు అరవింద్-రామ్ చరణ్:
రామ్ చరణ్ తేజ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు.
వెంకటేష్-నాగ చైతన్య:
అక్కినేని నాగచైతన్య తెలుగు సిని నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు మరియు విక్టరి వెంకటేష్ మేనల్లుడు, ఇద్దరు దాదా సాహెబ్ ఫాల్కే ల ముద్దుల మనవడిగా, నాన్న, మేనమామల నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోగా పరిచయం అయ్యాడు. వెంకటేష్ చెల్లెలు నాగార్జున ను వివాహం చేసుకోగా వారికి నాగచైతన్య పుట్టాడు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా నాగార్జున ఆమెతో విడిపోయి అమలను పెళ్లి చేసుకున్నాడు.