Moviesవిద్యాబాల‌న్ డ్రెస్ స్పెషాలిటీ ఏంటి... అంత రేటా..!

విద్యాబాల‌న్ డ్రెస్ స్పెషాలిటీ ఏంటి… అంత రేటా..!

బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్న నటీమణి విద్యాబాలన్‌. విద్యాబాలన్.. మల్టీటాలెంటెడ్ హీరోయిన్.. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో స్టార్ హీరోయిన్‏గా ఎదిగింది. ఆమె నటించే సినిమాలు, పాత్రలు విభిన్నంగా ఉంటాయి.

కేవలం గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించింది విద్యాబాలన్ అందుకే ఆమె ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. 2005లో ‘పరిణీత’ సినిమా ద్వారా విద్యాబాలన్‌ బాలీవుడ్ కు పరిచయమయ్యారు.

విద్యాబాలన్‌ నాయికగా ఈ మధ్య అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన “షేర్నీ” అటవీ నేపథ్యంలోని చిత్రాల్ని ఇష్టపడేవారిని అమితంగా ఆకర్షించింది. అడవి.. అడవిలో జంతువులు.. మనుషులు.. వారందరినీ కాపాడేవారు కొందరైతే.. వారిని ఉపయోగించుకుని లాభపడేవారు మరికొందరు.. వీరందరి మధ్య అడవిలో ఎలాంటి తతంగాలు నడుస్తున్నాయో.. ఒక ఫ్యాక్టోరియల్ మూవీగా షేర్నీ రూపొందింది. బాలీవుడ్ అగ్రకథానాయక విద్యాబాలన్ నటించిన షేర్నీ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా ఆమె షేర్నీ ప్రమోషనల్ ఈవెంట్ కోసం ఒక ఫ్లోరల్ లెన్త్ డ్రెస్సు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మృణాలిని రావు డిజైన్ చేసీన ఈ డ్రెస్ చూసేందుకు చాలా సింపుల్ గా ఉన్న ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. విద్యా బాలన్ వేసుకున్న ఈ ఫ్లోరల్ లెన్త్ డ్రెస్సు ధర అక్షరాల 17,900 రూపాయలట. అయితే ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news