మా ఎన్నికలు రసవత్తరంగా జరుగుతాయన్న దానిపై ఓ క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఇక ప్రకాష్ రాజ్‌కు మెగా కాంపౌండ్ మద్దతు ఉంది. ఇక మరో వైపు సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ అండదండలతో పాటు కృష్ణంరాజు సపోర్ట్‌తో మోహన్‌బాబు తన తనయుడు విష్ణును పోటీలో దించుతున్నారు. ఇక జీవితా రాజశేఖర్ కూడా పోటీలో ఉంటానని చెప్పారు. ఆమెకు బాలయ్య పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టు బయట ప్రచారం జరుగుతోంది. అయితే బాలయ్య జీవితకు సపోర్ట్ చేస్తే మా వార్ మామూలుగా ఉండదు.
అయితే బాలయ్య ఒక్కడే సపోర్ట్ చేయడం కంటే బాలయ్యకు తోడు ఎన్టీఆర్, అటు కళ్యాణ్ రామ్ కూడా ఎంటర్ అయ్యి… ఇండస్ట్రీలో ఉన్న నందమూరి కాంపౌండ్‌ను ఒక్కతాటిమీదకు తేగలిగితే అప్పుడు పోటీ జీవిత వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్యే ఉంటుంది. విష్ణు మూడో ప్లేస్‌కు వెళ్లిపోయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అయితే మెగా కాంపౌండ్ ఇప్పుడు ఒకే తాటి మీద ఉంది. అయితే నందమూరి కాంపౌండ్‌లో బాలయ్య , ఎన్టీఆర్ మధ్య సంబంధాలు అంతగా లేవు.
మరి మా ఎన్నికల కోసం వీరు కలుస్తారా ? అన్నది చూడాలి. ఒక వేళ బాలయ్య జీవితను గెలిపించాలని పూనుకుని.. ఎన్టీఆర్‌ను రంగంలోకి దించితే అప్పుడు మా పోరు మజా మామూలుగా ఉండదనే చెప్పాలి. అప్పుడు బాలయ్య జీవితకు సపోర్ట్ చేసినా బాగుంటుంది.. లేకపోతే బాలయ్య రంగంలోకి దిగినా జీవిత ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాలి. ఇప్పుడు నందమూరి కాంపౌండ్ ఒక్కటి అయితేనే బాగుంటుందన్నదే అందరి అభిప్రాయం.