అనుష్క శెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుష్క శెట్టి .. ఓ అందాలతార. తన అందంతో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ యోగా బ్యూటీ. అనుష్క.. అసలు పేరు స్వీటీ శెట్టి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. బాహుబలి సినిమా ద్వారా భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన సినీతారగా గుర్తింపు తెచ్చుకుంది.
వెండితెరపై స్వీటీ అందం, అభినయం చూసి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ప్రతిభ తన సొంతమని అనుష్క ప్రూవ్ చేసింది. అయితే కెరీర్ లో అనుష్క చేసిన ఒకే ఒక తప్పు ఆమెకు అవకాశాలు తగ్గడంతో పాటు కొత్త సమస్యలకు కారణమవుతోంది. అనుష్క ‘బాహుబలి-1’ తర్వాత సైజ్ జీరో అనే ఓ ప్రయోగాత్మక చిత్రం చేసింది.
ఈ సినిమా కోసం ఆమె బాగా బరువు పెరిగాల్సివచ్చింది. ఇదే ఆమె కెరీర్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ఆ సినిమా కోసం బరువు అయితే ఈజీగానే పెరిగింది కానీ.. తగ్గించుకోవడమే కష్టమైందట. మరోవైపు అనుష్కకు గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు బాగా తగ్గాయి. ఈ మధ్య కాలంలో అనుష్క నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారిందని అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు.
సినిమాల పరంగా ఎలా ఉన్నా అనుష్క గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తుంటాది. ఆ వార్త మరెదోకాదండి.. మన డార్లింగ్ యంగ్ హీరో ప్రభాస్‌తో అనుష్క డేటింగ్ చేస్తోందని, ఆయనతో పెళ్లి కూడా కన్ఫమ్ అయిందనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఈ వార్తలను అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్దరూ ఖండించినా.. వాటికి ఫుల్స్టాప్ మాత్రం పడటంలేదు.