పూజా హెగ్డే.. భారతీయ మోడల్ మరియు నటి. ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని మరో అనుమానం లేకుండా చెప్తున్నారు. కన్నడ భామ పూజా హెగ్డే అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది.
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పుడు పూజా హెగ్డే తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్, రాధేశ్యామ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్, దళపతి విజయ్ చిత్రాల్లోనూ హీరోయిన్గా ఎంపికయ్యారు. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది.
తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో డిమాండ్ చేస్తుందట. పూజ, తన దగ్గరకు సినిమా ఆఫర్లతో వస్తున్న నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. నిన్న మొన్నటి వరకు 1.5, 2 కోట్లు తీసుకున్న ఈ బుట్టబొమ్మ.. ఒక్కసారిగా ఆ రేటు డబుల్ చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మీదట పూజా డార్లింగ్.. ఏ సినిమా చేసిన 3 కోట్లు లేదా 4 కోట్లు చార్జ్ చేస్తుందంట. అయితే పూజకున్న క్రేజ్ దృష్ట్య ఎంత పారితోషికం అయినా ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. బాగా ముందు చూపు ఉన్న ఈ హాట్ బ్యూటి.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని పక్కాగా ఫాలో అవుతుంది అనిపిస్తుంది.