సినిమా జయాపజయాలను బట్టి పారితోషికం విలువల్లో కూడా మార్పుచేర్పులు జరుగుతూ ఉంటాయి. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ ఒక్కసారి స్టార్ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత సినిమా హిట్టయినా, ఫట్టయినా పారితోషికం పెరుగుతూ ఉంటుందే తప్ప తరుగుదల మాత్రం ఉండదు. పైగా పారితోషకం విషయంలో బాలీవుడ్ హిరోయిన్లకి, సౌత్ హీరోయిన్లకి చాలా తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఒక్క సినిమాకి వచ్చే రెమ్యునరేషన్.. సౌత్‌లో రెండు, మూడు సినిమాలు చేసిన రావు.
ప్రస్తుతం బాలీవుడ్ ని శాసిస్తున్న..ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, కృతి సనన్.. వీరంతా ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. కొందరైతే హాలీవుడ్‌లోనూ అవకాశాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోలకు తగ్గట్టుగా పారితోషికం అందుకుంటూ జోరు చూపిస్తున్నారు. అయితే ఇంత ఎదిగిన వీరు ఒకప్పుడు ఎంత పారితోషికం తీసుకునే వారు.. అసలు వీరి మొదటి పారితోషికం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రియాంక చోప్రా: మొదటి సంపాదన 5 వేల రూపాయలు. తన మొదటి సంపాదనను ప్రియాంక చోప్రా ఆ సమయంలో తన తల్లికి ఇచ్చిందట. అప్పట్లో 5 వేలు అంటే చాలా పెద్ద మొత్తమే.
దీపికా పదుకొణె: ప్రియాంకా చోప్రా తర్వాత హాలీవుడ్ అవకాశం దక్కించుకుంది దీపికా పదుకొణె. ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని హీరోలకు పోటీగా పారితోషికం తీసుకుంటూ దూసుకెళ్తోంది.
కంగనా రనౌత్: తాను సంపాదించుకున్న మొత్తంను కాస్ట్యూమ్స్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేసిందట. రూ.50 వేల ఖర్చు చేసి మరీ కంగనా తన కాస్ట్యూమ్స్ ను కొనుగోలు చేసిందట.
ఆలియాభట్ : ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఆలియా భట్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. . ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఆలియా భట్.. తక్కువ సమయంలోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీనటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే స్టార్ కిడ్ ఆలియా భట్ కు మొదటి నుండి కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె మొదటి సంపాదన సినిమాతోనే వచ్చింది. ఆలియా భట్ తన మొదటి సంపాదనను తన అవసరాలకే వినియోగించుకుందట.
సోనాక్షి సిన్హా : ఇక సల్మాన్ ఖాన్ కు జోడీగా హీరోయిన్ గా మొదటి ఆఫర్ ను దక్కించుకున్న సోనాక్షి సిన్హా పాతిక లక్షల పారితోషికం అందుకుందట.