మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ రోజు ప్రకాష్ రాజ్, నాగబాబు కలిసే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రకాష్ రాజ్‌కు మెగాస్టార్ సంపూర్ణ మద్దతు ఉందని చెప్పిన నాగబాబు.. ఆయన సర్వీస్ చూసి ముచ్చటేసి.. మాకు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఉండాలనే ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సభ్యత్వం ఉంటే మా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని.. లోకల్, నాన్ లోకల్ వివాదాలు అర్ధరహితం అని చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా మా ప్రతిష్ట మసక బారిందని.. మళ్ళీ మా ప్రతిష్ష పెరిగే విధంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి వుండాలి అని మేము సపోర్ట్ చేస్తున్నామని నాగరాజు కుండబద్దలు కొట్టేశాడు.
ఇక మా లో ఎంతలేదన్నా కమ్మ వర్గం ఆధిపత్యం ఉంది. తెర ముందు ఎవరు ఉన్నా తెరవెనక వారే గెలుపు ఓటములు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇక మాను కూడా కంట్రోల్ చేయాలని చిరంజీవి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మా గత పాలక వర్గంలో ఎంత రచ్చ జరిగిందో మనం చూశాం. నరేష్ ( కమ్మ వర్గానికి చెందిన వారే) గెలుపు కోసం నాడు నాగబాబు, మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. నాడు శివాజీ రాజాను కాదనుకుని నరేష్‌ను గెలిపిస్తే పరువు అంతా పోయింది. నరేష్, జీవిత, రాజశేఖర్, హేమ గొడవలు మామూలుగా లేవు.
ఇక్కడ ఇప్పుడు ఎవరిని నిలబెట్టినా.. మళ్లీ కమ్మ వర్గంలో ఎవరో ఒకరిని నిలబెట్టాలి… వారి ప్రాపకం ఉండాలి.. ఇవన్నీ లేకుండా ఉండేందుకే ప్రకాష్ రాజ్‌ను రంగంలోకి దింపి కమ్మలకు చెక్ పెట్టాలనే చిరు ఈ వ్యూహం రచించారని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు పోటీగా అదే కమ్మ వర్గానికి చెందిన మంచు విష్ణు పోటీలో ఉన్నారు. చాలా తెలివిగా కమ్మలకు చెక్ పెట్టే క్రమంలోనే చిరు ప్రకాష్ రాజ్‌ను రంగంలోకి దింపి సపోర్ట్ చేస్తున్నట్టు భోగట్టా.. మరి చిరుకు పోటీగా అపొజిషన్ క్యాంప్ ఎలాంటి వ్యూహాలకు తెరదీస్తుందో ? చూడాలి.