తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నారు. మన స్టార్ హీరోలే కానక్కర్లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో చేసిన డిజాస్టర్ సినిమాలను అక్కడ డబ్ చేసి చివరకు యూట్యూబ్‌లో వదిలినా కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అందుకే బెల్లంకొండ సినిమాల డబ్బింగ్ రైట్స్‌కు సైతం మంచి రేటే పలుకుతోంది. చివరకు బెల్లంకొండ అక్కడ తన మార్కెట్ పెంచుకునేందుకే ఛత్రపతి సినిమాను హిందీలో తీస్తోన్న పరిస్థితి.
మన మాస్ సినిమాలంటే బాలీవుడ్ మాస్ జనాలు పడి చస్తారు. బోయపాటి జయజానకీ నాయక, వినయ విధేయ రామకు మంచి రేటు వచ్చింది. ఇప్పుడు బాలయ్య అఖండను సైతం రు. 15 కోట్లకు అమ్మేశారు. ఇక బన్నీ సినిమాలను డబ్ చేస్తే ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. బన్నీ – సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది.
చివరకు భేరసారాల తర్వాత కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ ను రు. 17 కోట్లకు అమ్మేశారని తెలుస్తోంది. ఇది పుష్ప ఫస్ట్ పార్ట్ రేటు మాత్రమే. రెండో పార్ట్ ను మళ్లీ అమ్ముతారు. ఈ రేటు చూస్తుంటే పుష్ప ప్రి రిలీజ్ బిజినెస్ రేంజ్ , బన్నీ స్టామినా ఏంటో తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.