1980వ దశకంలో హీరోయిన్ రాధ అంటే అప్పట్లో కుర్ర కారు గుండెల్లో గిలిగింతలు పెట్టే హీరోయిన్. తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించిన రాధ ఆ వెంటనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే రాధ సినిమాలకు దూరం కావడం ఆమె అభిమానులకు సైతం షాక్ ఇచ్చినట్లయ్యింది. ఆ తర్వాత తన వారసురాలిగా పెద్ద మ్మాయి కార్తీకను సినిమాల్లోకి తీసుకు వచ్చింది. కార్తీక కు రాధలా అందం లేదు.. ఇటు అభినయమూ లేదు.
చివరకు ఆమెను హీరోయిన్ గా నిలబెట్టేందుకు రాధ స్వయంగా రంగంలోకి దిగింది. రంగం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చినా తర్వాత దానిని సద్వినియోగం చేసుకోలేక పోయింది. రాధ రికమెండేషన్ తోనే ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాలో ఛాన్స్ వచ్చిందని అంటారు. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఆమెకు పెద్ద హీరోలు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. చివరకు అల్లరి నరేష్ సినిమాలో కూడా ఓ క్యారెక్టర్ చేసింది. అయినా ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు.
చివరకు బీ టౌన్ లోకి వెళ్లి అక్కడ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో ఆమె హోటల్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటికే యూటీఎస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహిస్తున్న కార్తీక ఇప్పుడు ఆ సంస్థలో డైరెక్టర్ గా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కార్తీక సోదరి తులసి కూడా కడలి లాంటి సినిమాలు చేసినా గుర్తింపు రాక ఖాళీగా ఉంటోంది.