ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు జయరామ్.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తుపాకీ, పంచతంత్రం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జయరాం.. అన్ని భాషల్లోనూ సుమారు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ఇక చాలా కాలం తర్వాత తెలుగులో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన `భాగమతి` చిత్రంలో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
అలాగే ఇటీవల `అల వైకుంఠపురములో` బన్నీ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. అయితే సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న జయరాం భార్య కూడా ఒకప్పటి టాప్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. జయరామ్ భార్య పార్వతి మలయాళంలో ఏకంగా డబ్బై సినిమాల్లో నటించింది.
మలయాళంలో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన పార్వతిని 1992లో జయరామ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.పెళ్లి తర్వాత పార్వతి సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతోంది. ఇక జయరామ్-పార్వతి దంపతులకు కూతురు మాళవిక, కొడుకు కాళిదాస్ ఉన్నారు. కాగా, ప్రస్తుతం జయరామ్ తెలుగులో పవన్-క్రిష్ కాంబోలో రాబోతున్న చిత్రంలో నటించనున్నాడు.