Megastar Chiranjeevi has entered in 50 crores club for the first time with his prestigious project Khaidi No 150 in just six days of it’s run.
బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ ద్వారా సృష్టిస్తున్న ప్రభంజనం అంతాఇంతా కాదు. ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ.. గత రికార్డుల్ని బద్దలుకొట్టడమే కాకుండా డ్రీమ్ మార్క్‌లను అలవోకగా దాటేస్తున్నాడు. ఇప్పటికే యూఎస్ఏలో ఐదు రోజుల లాంగ్ వీకెండ్ (ప్రీమియర్స్‌తో కలుపుకుని)లో 2 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసిన చిరు.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల మార్క్‌ని దాటేశాడు. అవును.. కేవలం ఆరు రోజుల్లోనే ఆ ఫీట్‌ని అందుకున్నాడు మెగాస్టార్.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని ఆరు రోజుల్లో ‘ఖైదీ’ సినిమా రూ. 51.33 కోట్లు (షేర్) కొల్లగొట్టింది. ఇంత తక్కువ టైంలో అంత మొత్తం కలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం. సాధారణంగా.. 50 కోట్ల క్లబ్‌లో చేరడం అంతా ఆషామాషీ విషయం కాదు. కానీ.. చిరంజీవి కేవలం ఆరు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరి, తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. వీక్ డేస్‌లోనూ ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే.. ఇది మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు.
ఏరియాల వారీగా 6 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 13.20
సీడెడ్ : 9.38
ఉత్తరాంధ్ర : 7.40
గుంటూరు : 5.08
ఈస్ట్ గోదావరి : 5.39
వెస్ట్ గోదావరి : 4.55
కృష్ణా : 3.78
నెల్లూరు : 2.25
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 51.33 కోట్లు (షేర్)