ఈ సృష్టికి మూలమే శృంగారం.. మనిషి జీవనానికి ఆకలి, దప్పిక ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం అనేది ఒక వయస్సు వచ్చినప్పటి నుంచి మనతో పాటు జీవితాంతం ఉండేదే. అయితే జీవితంలో ఓ వయస్సు వచ్చాక దీని సామర్థ్యం తగ్గుతుందా ? కోరికలు తగ్గుతాయా ? అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. ప్రస్తుతం మానవుడి ఒత్తిడి జీవితంతో కంపేరిజన్ చేస్తే మనకంటే మన పూర్వీకులే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనే వారని నివేదికలు చెపుతున్నాయి.
కాలగమనంలో పురుషుల్లో శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుందన్నది వాస్తవమే. అయితే పురుషుల్లో ఏ వయస్సులో శృంగార సంతృప్త స్థాయి ఎలా ఉంటుదనే దానిపై నిపుణులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సహజంగా మానవుడికి 20 ఏళ్ల వయస్సులో శృంగార కోరికలు ఎక్కువగాను, మాంచి సరపట్టుతో శృంగారం ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇదే కరెక్ట్ టైం. ఇక 30 ఏళ్ల వయస్సులో ఈ కోరికలు కాస్త కంట్రల్లో ఉంటాయి. ఈ వయస్సులో అవసరమైనప్పుడు మాత్రమే శృంగారం చేస్తుంటారట.
ఇక 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికి అంగస్తంభన సమస్యలు ప్రారంభమవుతాయట. ఈ వయస్సులో కూడా శృంగారం ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక 50 ఏళ్ల వయస్సులో కోరికలు తగ్గుతాయని.. 60 ఏళ్లకు శృంగార సామర్థ్యం తగ్గుతుందని.. 70 ఏళ్ల వయస్సులో ఇవి పూర్తిగా కనుమరుగు అవుతాయని నిపుణులు తేల్చారు. అయితే కొందరిలో మాత్రం వయస్సు పెరిగినా ఈ కోరికలు ఎక్కువగానే ఉంటాయి. అవి వారి ఆహారం, అలవాట్లు, కోరికలను బట్టి ఉంటాయట.