MoviesR R R లో ఎన్టీఆర్ ల‌వ‌ర్‌గా మ‌రో హీరోయిన్‌... జోడీ...

R R R లో ఎన్టీఆర్ ల‌వ‌ర్‌గా మ‌రో హీరోయిన్‌… జోడీ సూప‌రే..!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన భీం, అల్లూరి టీజ‌ర్లు ఎలా దుమ్ము రేపుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

 

 

ఇక ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. మ‌రో హీరోయిన్‌గా సీనియ‌ర్ ముద్దుగుమ్మ శ్రేయ‌ను కూడా రాజ‌మౌళి ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు ఈ ముగ్గురు హీరోయిన్ల‌కు తోడుగా మ‌రో హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు మ‌న తెలుగ‌మ్మాయి అయిన టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేష్‌. ఎన్టీఆర్ ప‌క్క‌న విదేశీ హీరోయిన్ ఒలివియాతో పాటు ఐశ్వ‌ర్య కూడా న‌టించ‌నుంది.

 

 

కొమ‌రం భీం అయిన ఎన్టీఆర్‌ను ప్రేమించే గిరిజ‌న యువ‌తిగా ఆమె క‌నిపిస్తుంద‌ట‌. ఆమె పాత్ర‌కు నిడివి తక్కువ అయినప్పటికీ ఇది సినిమాలో ఎంతో కీలకమంటున్నారు. ఎన్టీఆర్ ప‌క్క‌న ఐశ్వ‌ర్య అంటే జోడీ న‌ట‌నా ప‌రంగా అద‌ర‌గొట్టేస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఏదేమైనా రోజు రోజుకు ఆర్ ఆర్ ఆర్‌లో కాస్టింగ్ పెరిగిపోతోంది. వీళ్ల పాత్ర‌ల‌ను రాజ‌మౌళి ఎంత ఆస‌క్తిగా ప్ర‌జెంట్ చేస్తాడో ?  చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news