ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి ఏ మాత్రం వెనక్కు తగ్గే ప్రశక్తే కనపడడం లేదు. బాహుబలి 1, 2ల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకునే రాజమౌళి ఎక్కడా రాజీపడకుండా ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా ఏడెనిమిది నెలలు షూటింగ్ వాయిదా పడడంతో రాజమౌళి మిగిలిన పార్ట్‌ను చాలా స్పీడ్‌గా లాగించేస్తాడని అందరూ అనుకున్నారు.
అలా చేస్తే మనోడు జక్కన్న ఎందుకు అవుతాడు. ప్రతి సీన్‌ను కూడా నాలుగైదు గంటల పాటు తీస్తున్నాడట. ఈ లెక్కన చూస్తే వచ్చే సమ్మర్ వరకు కూడా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా లేదు. దీంతో తారక్‌లో రాజమౌళిపై పైకి చెప్పకపోయినా లోపల కాస్త అసహనం పెరుగుతోందట. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి వేర్వేరు ప్రాజెక్టులు కమిట్ కావడంతో ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎప్పుడు బయట పడతామా ? అని చూస్తున్నారు.
అయితే రాజమౌళి చెక్కుడు వ్యవహారం చూస్తుంటే ఇప్పుట్లో వీరిని వదిలేలా లేదు. మరోవైపు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకోవడంతో ఎన్టీఆర్ కాస్త స్పీడ్‌గా ఆర్ ఆర్ ఆర్‌ను ముగించమని రాజమౌళికి రిక్వెస్ట్ చేస్తున్నా రాజమౌళి తన పంథాలోనే ముందుకు వెళుతున్నాడట. రాజమౌళికి సినిమాను స్పీడ్‌గా ముగించడం ముఖ్యం కాదు.
తాను అనుకున్న అవుట్ ఫుట్ వచ్చేంత వరకు సినిమాను చెక్కుతూనే ఉంటాడు. సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు తప్పకూడదన్నదే రాజమౌళి టార్గెట్. మరోవైపు త్రివిక్రమ్ నుంచి ప్రెజర్ ఉండడంతో ఎన్టీఆర్ ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా ? అని వెయిట్ చేయడం మినహా చేసేదేం లేకుండా పోయింది.