దివంగత రియల్ స్టార్ శ్రీహరి తెలుగు సినిమా తెరపై ఎంత విలక్షణ నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగా అయినా, విలన్‌గా అయినా.. కమెడియన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను శ్రీహరి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. శ్రీహరి చిన్న వయస్సులోనే 49 ఏళ్లకే అకాల మరణం చెందారు. శ్రీహరి – డిస్కోశాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. తాజాగా డిస్కోశాంతి తన తాజా ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
శ్రీహరి ఇంటికి సినిమా పరిశ్రమకు చెందిన వారే కాకుండా.. బయట వ్యక్తులు వచ్చి ఏ సహాయం కావాలన్నా శ్రీహరి వెంటనే చేసేవారట. సినిమాల ద్వారా శ్రీహరి సంపాదించిన సొమ్మును చాలా వరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసేవారని శాంతి చెప్పింది. ఇక శాంతి శ్రీహరిని పెళ్లి చేసుకోకముందు పాపులర్ హీరోయిన్, స్పెషల్ సాంగ్‌లకు పెట్టింది పేరు. చిరంజీవితో ఘరానా మొగుడు సినిమాలో ఆమె బంగారు కోడిపెట్ట సాంగ్‌కు పోటీపడి మరీ డ్యాన్స్ చేసింది.
ఆమె అనేక భాషల్లో 900 సినిమాల్లో నటించింది. అయితే శ్రీహరి మరణంతో ఆమె తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఆర్థికంగా కూడా కష్టాలు వచ్చినా ఆమె నిలదొక్కకుకున్నారు. అలా జీవితంలో శ్రీహరి మరణాంతరం శాంతి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావట. ప్రస్తుతం ఆమె ఇద్దరు కుమారులతో కలిసి చెన్నైలో నివాసం ఉంటోంది. ఇక ఇటీవలే శ్రీహరి పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీహరి రాజ్‌దూత్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు.