ఐపీఎల్ సీజన్లో బెట్టింగులు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెట్టింగ్ రాయుళ్లు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తుంటారు. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా బెట్టింగ్లకు మాత్రం బ్రేకులు పడడం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలంలో బెట్టింగ్ డబ్బులు ఓ బాలిక హత్యకు కారణమయ్యాయి. క్రికెట్ బెట్టింగ్లో రు. 2 వేల కోసం ఓ వ్యక్తి బాలికను చంపేశాడు.
లింగపాలెం మండలం తోచలకరాయుడి పాలెంలో ఇటీవల 8 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. పోలీసులు ఈ కేసును విచారించగా ప్రధాన నిందితుడు బన్నును అదుపులోకి తీసుకుని విచారించారు. క్రికెట్ బెట్టింగ్లో పోయిన రు. 2 వేలు చెల్లించేందుకు బాలిక చెవి దిద్దుల కోసం ఆమెను చంపేశాడు.
బన్ను ఐపీఎల్లో క్రికెట్ బెట్టింగ్లు వేస్తుంటాడని. ఈ క్రమంలోనే తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తుంటాడని.. ఈ క్రమంలోనే బెట్టింగుల్లో పోయిన డబ్బుల కోసమే ఆ బాలికను హత్య చేశాడని పోలీసులు చెప్పారు.