Gossipsచిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌.. రక్తికట్టించేందుకు మరో స్టార్ హీరో?

చిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌.. రక్తికట్టించేందుకు మరో స్టార్ హీరో?

chiranjeevi balakrishna combo promotions for their movies with a star hero.

సాధారణంగా ఒక స్టార్ హీరో మరొకరిని పొగుడ్తూ వ్యాఖ్యానిస్తే.. అది అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది. ఒకవేళ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే ఫ్రేమ్ మీద కనిపిస్తే.. వారి అభిమానాల ఆనందానికి హద్దుల్లేకుండా పోతాయి. వారిలాగే ఇతర హీరోలు కూడా కలిస్తే బాగుంటాయనే అభిప్రాయాలు వెలువడతాయి. అలాంటిది.. ఇద్దరూ లెజెండ్స్ ఒకే వేదికపై కనువిందు చేస్తే, ‘అభిమానం’ అనే దానికి హద్దులే చెరిగిపోతాయి. ఇక్కడ ఆ ఇద్దరు లెజెండ్స్ మరెవ్వరో కాదు.. చిరంజీవి, బాలయ్య.

ఒకరేమో పదేళ్ల తర్వాత 150వ సినిమా చేస్తే, మరొకరు చారిత్రాత్మక నేపథ్యంతో తన 100వ చిత్రం చేశారు. చాలాకాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్న వారి సినిమాలు.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో.. చిరు, బాలయ్యలిద్దరూ భారీ ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టారు. ఇంటర్వ్యూలు, థాంక్స్ మీట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై ‘కాంబో ప్రమోషన్’ నిర్వహిస్తే, చాలా బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ అభిప్రాయాన్ని చాలామంది సినీ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఒకేసారి తమ సినిమాల్ని రిలీజ్ చేసి అభిమానుల్ని సంతోషపరిచిన ఈ క్రేజీ హీరోలు.. ఒకేసారి కలిసి ఇంటర్వ్యూలు ఇస్తే ఇంకా బాగుంటుందని అంటున్నారు. ఒక స్టార్ హీరో వాళ్లిద్దరినీ కలిపి ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఏదైనా ఒక టీవీ చానల్ అలాంటి ఓ ఇంటర్వ్యూ నిర్వహిస్తే.. అటు మెగాఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఖుషీ అవుతారని యోచిస్తున్నారు. అంతేకాదు.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ‘శాతకర్ణి’ గురించి చిరు, ‘ఖైదీ’ గురించి బాలయ్య మాట్లాడితే.. సినీ ఇండస్ట్రీలో బంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నారు. దీంతో.. బాలయ్య చిత్రానికి మెగాఫ్యాన్స్, చిరు సినిమాకి నందమూరి అభిమానులు క్యూ కడతారని భావిస్తున్నారు. ఫలితంగా.. తమ రెండు సినిమాలకే కాకుండా ఇతర మూవీలకు ‘అభిమానం’ అనే ముసుగును తొలగించినట్లు అవుతుందని చెబుతున్నారు. పైగా.. ఈ ఇంటర్వ్యూ ఒక ట్రీట్‌లా మిగిలిపోతుంది. మరి.. వాళ్లిద్దరూ కలిసి ‘కాంబో ప్రమోషన్’ నిర్వహిస్తారో లేదో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news