మనం చిన్నప్పటి నుంచి కరెంటు వైర్లపై కూర్చున్న పక్షులను చూస్తూనే ఉంటాం. అయితే చాలా మందికి కరెంటు వైర్లపై కూర్చుంటే పక్షులకు షాక్ కొట్టదా ? అనిపిస్తుంటుంది. ఒకే వైరుపై ఉన్న పక్షికి ఎలాంటి షాక్ కొట్టదు.. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మనకు వచ్చే కరెంటులో మొత్తం నాలుగు తీగలు ఉంటాయి. ఇందులో మూడు తీగలను ఫేజ్‌లుగా, ఒకదానిని న్యూట్రల్‌గా పిలుస్తుంటాం. ఇందులో ఒక ఫేజ్ తీగకు మరో ఫేజ్ తీగకు మధ్య న్యూట్రల్ తీగకు మధ్య విద్యుత్ పొటెన్షియల్ ఉంటుంది.
ఏ వస్తువుకు లేదా పదార్థానికి షాక్ కొట్టాలంటే ఏకకాలంలో రెండు తీగలను పట్టుకుంటేనే జరుగుతుంది. ఒక తీగను మనిషి పట్టుకున్నా కూడా ఏమీ కాదు. అయితే ఆ సమయంలో చెప్పుల్లేకుండా తీగను తాకినా కరెంట్ పాస్ అవుతుంది. అయితే ఒకే సారి రెండు తీగలను పట్టుకుంటే మాత్రం గాల్లో ఉన్నా కరెంట్ షాక్ కొడుతుంది. ఇక పక్షులు కూడా ఒకే తీగపై ఉంటే ఇబ్బంది ఉండదు. పొరపాటున దాని శరీరం రెండు తీగకు కూడా టచ్ అయితే వెంటనే కరెంట్ షాక్ కొట్టి చనిపోతాయి.
అలాగని ఒక్కోసారి ఒక వైరు పట్టుకుంటే ఏం జరగదులే అని ప్రయోగాలు చేసినా ఇబ్బందే. ఎక్కడో కో చోట రెండు వైర్లు కలిసి ఉంటే అలాంటి సమయంలో జరగరాని ప్రమాదాలు జరిగినా ప్రాణాలు పోతుంటాయి.