ఓ పుస్తకం ఏకంగా రు. 73 కోట్లకు అమ్ముడు పోయింది. అంత రేటుకు అమ్ముడు పోయిన ఆ పుస్తకం గొప్పతనం ఏంటో ? ఆ పుస్తకం వివరాలు ఏంటో చూద్దాం. షేక్స్పియర్ రాసిన మొదటి నాటక సంకలనం అయిన ఫస్ట్ పోలియో 36 నాటకాలతో రాసిన ఈ పుస్తకం 1623లో ప్రింట్ చేయించారు. అప్పట్లో ఈ పుస్తకం ముద్రించేందుకు షేక్స్పియర్కు ఇద్దరు స్నేహితులు జాన్ హెమింగే, హెన్నీ కోండెల్ సహకరించారట.
ఇంగ్లీష్ మాస్టర్ పబ్లికేషన్స్ ద్వారా అప్పట్లో ఈ పుస్తకం మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆ పుస్తకం వేలం వేయగా వేలంలో 4 – 6 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇది అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ రెట్టింపు ధరకు రు 9.97 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. భారతీయ కరెన్సీలో చెపితే ఇది రు. 73 కోట్లు అన్నట్టు లెక్క.
న్యూయార్క్‌లోని క్రిస్టీ వేలంలో దీనిని వేలం వేశారు. అయితే గతంలో బిల్‌గేట్స్ కూడా కో డెక్స్ లియోసెస్టర్ ఆప్ లియానార్డో డే విన్సి అనే పుస్తకం రాయగా ఇది రికార్డు స్థాయిలో మన కరెన్సీ ప్రకారం రు. 200 కోట్లకు అమ్ముడైంది. దీనిని 1994లో వేలం వేశారు