పవన్ కళ్యాణ్ అత్త తెలుసా.. పవన్ అత్త అంటే రియల్ అత్త కాదు రీల్ అత్త. నదియా గతంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. అయినా ఆమెకు ఆ సినిమాలతో రాని గుర్తింపు అత్తారింటికి దారేది సినిమాతో వచ్చింది. నదియా ఎన్ని సినిమాలు చేసినా పవన్ అత్త అన్న పేరుతో ఎప్పటకీ పాపులర్ అయ్యేంత గుర్తింపు ఆ సినిమాతో ఆమెకు వచ్చింది. ఆమె ఎన్నో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తోంది. నదియా సినిమాలో ఉందంటే ఆ సినిమాకు వస్తోన్న క్రేజే వేరు.
తెలుగులో ఇప్పటికే ప్రభాస్‌కు మిర్చిలో తల్లిగా, పవన్‌కు అత్తారింటికి దారేది సినిమాలో అత్తగా, వెంకటేష్ దృశ్యం సినిమాలో తల్లిగా ఎన్నో పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ వయస్సులో కూడా అభినయంలో మాత్రమే కాదు అందంలోనూ హీరోయిన్లతో పోటీ పడే నదియా వయస్సు 53 సంవత్సరాలు. శిరీష్ గాడ్ బోలే అనే వ్యక్తిని పెళ్లాడిన నదియాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు కూడా సేమ్ తల్లి నదియాలాగే ఊడిపడ్డారు.
వీరిలో ఒకరి పేరు సనమ్, మరొకరు జానా. వీరు కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే తల్లికి పోటీ ఇస్తారనడంలో సందేహం లేదు. అయితే నదియా తన కూతుళ్లను సినిమాల్లోకి తీసుకు వస్తుందా ? లేదా ? అన్నది ఊడాలి. ప్రస్తుతం నదియా నటించిన సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.