దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏడు నెలల గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ప్రారంభమైనా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతుండడంతో మళ్లీ షూటింగ్‌కు అంతరాయం కలుగుతోంది. రు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు దేశవ్యాప్తంగా స్కై రేంజ్‌లోనే ఉన్నాయి.
అక్టోబర్ 22వ తేదీన ఎన్టీఆర్ కొమరం భీం లుక్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ ఫిక్సయ్యి వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే సమ్మర్‌కు అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందా ? అన్నది సందేహంగానే ఉంది. ఇక దానయ్య రు. 400 కోట్ల పెట్టుబడితో ఈ సినిమాను నిర్మిస్తుంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు రు. 200 కోట్ల ఆఫర్ వచ్చిందట.
కేవలం డిజిటల్ రైట్స్‌తోనే ఏకంగా రు. 200 కోట్లు ( పెట్టుబడిలో సగం) వచ్చిందంటే ఆర్ ఆర్ ఆర్ మానియా దేశవ్యాప్తంగా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అప్పుడే ఆర్ ఆర్ ఆర్ లాభాల భాట పట్టడం ఆర్ ఆర్ ఆర్ యూనిట్ వర్గాల్లో మాంచి జోష్ నింపిందట.