హైదరాబాద్‌లో వర్షం భీభత్సం క్రియేట్ చేసింది. ఈ భారీ వర్షానికి ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారమే 12 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇక నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోతోన్న వీడియో వైరల్ ( పాతబస్తీతో) అవుతుండడం నగర ప్రజలను మరింత భయపెడుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు సంస్థలకు అక్టోబర్ 14, 15వ తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.
ఇక సహాయ చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఇక పురాతన ఇల్లల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇక పాతబస్తీలో రోడ్లు అన్ని జలమయం అయ్యాయి. ఈ ప్రాంతంలో ఎవరు అయినా బయటకు వస్తే సేఫ్‌గా ఇంటికి వెళతారన్న గ్యారెంటీ లేదు. ఇక రామాంతాపూర్ చెరువు నిండి రోడ్ల మీదకు నీళ్లు రావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పలు కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. భారీ ట్రాఫిక్ తో వాహనదారులు ఇబ్వందులు పడుతున్నారు.
ఇక పురానాఫూల్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ రోడ్డుపై ఏకంగా 10 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఇక హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండి, అక్కడి నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో మూసీ నది లోతట్టు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఓ వైపు మంత్ర కేటీఆర్ ఎప్పటికప్పుడు అందరిని అప్రమత్తం చేస్తున్నారు.
ఇక నగర రోడ్లపై ఉన్న నీళ్లను పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్‌హోల్స్ వద్ద సురక్షిత చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు ఎవరు అయినా బయటకు వస్తే ఈ మ్యాన్ హోల్స్లోనే కాదు రోడ్లపై కాలువల్లా వెళుతోన్న వరదల్లో చిక్కుకున్నా ప్రాణాలపై ఆశలు వదులు కోవాల్సిందే.