సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమా ప్లాప్ అయినా ఆ సినిమాలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ అమృతారావ్‌కు మంచి పేరు వచ్చింది. 2007లో వచ్చిన ఈ సినిమాతో తెలుగులోకి అతిథిలా వచ్చి అతిథాలానే అమృత వెళ్లిపోయింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఆమె అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. మై హునా, షికార్, వివాహ్, హే బేబీ, లైఫ్ ఫార్ట్‌నర్, జాలీ ఎల్ఎల్బీ, సత్యాగ్రహ థాకరే లాంటి సినిమాల్లో నటించింది.
ఇక 2016లో ఆర్ జె మోల్‌తో ప్రేమలో పడిన ఆమె అతడిని నిరాడంబరంగా పెళ్లి చేసుకుంది. బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఉన్నప్పుడే ఆమె మోల్‌తో ప్రేమలో పడడం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె తల్లి కాబోతోంది. ఇక పెళ్లి చేసుకున్నప్పుడే చాలా కాలం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన ఆమె ఇప్పుడు తల్లి కాబోతోన్న విషయం కూడా అంతే సీక్రెట్‌గా ఉంచింది. అయితే అమృత తన భర్తతో కలిసి ఓ ప్రైవేట్ హాస్పటల్ ముందు గర్భంతో ఉన్న విషయం మీడియా కెమేరాలకు చిక్కింది.
దీంతో ఆమె గర్భవతి అన్న వార్తలు మీడియాలో వస్తుండడంతో ఆమె దీనిని చెప్పక తప్పలేదు. తాను తల్లి అవుతోన్న విషయం ఆమె చెప్పింది. దీంతో పలువురు సన్నిహితులు ఆమెకు విషెస్ చెపుతున్నారు.