Moviesఏపీలో థియేట‌ర్లు ఓపెన్ కావ‌ట్లేదు... భ‌లే దెబ్బేశారే...!

ఏపీలో థియేట‌ర్లు ఓపెన్ కావ‌ట్లేదు… భ‌లే దెబ్బేశారే…!

క‌రోనా లాక్‌డౌన్‌తో మూత‌ప‌డిన థియేట‌ర్ల‌ను ఈ నెల 15 నుంచి తెర‌చుకోవ‌చ్చి కేంద్రం అనుమ‌తి ఇచ్చింది. అయితే ప‌లు రాష్ట్రాలు మాత్రం థియేట‌ర్ల‌ను తిరిగి ప్రారంభించే విష‌యంలో వెన‌కా ముందు ఆడుతున్నాయి. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్లు తెరిచినా ప్రేక్ష‌కులు సినిమా చూసేందుకు వ‌స్తారా ?  రాదా ? అన్న సందేహాలు చాలానే ఉన్నాయి. ఏపీలోనూ ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెరిచే ప‌రిస్థితి లేదంటున్నారు.

 

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో పెద్ద సినిమాలు రిలీజ్ చేసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్‌తో పాటు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు థియేట‌ర్లు తెరిచినా చిన్నా చిత‌కా సినిమాలు మాత్ర‌మే రిలీజ్ చేయాలి. ఇప్ప‌టికే లాక్‌డౌన్‌లో పేరుకుపోయిన విద్యుత్ బ‌కాయిలు అలాగే ఉన్నాయి. కొన్ని థియేట‌ర్ల‌కు ఇప్ప‌టికే విద్యుత్ క‌నెక్ష‌న్ క‌ట్ అయ్యింది.

 

వాటిని ర‌ద్దు చేయాల‌ని థియేట‌ర్ల య‌జ‌మాన్యాలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో 1100 థియేటర్లు ఉన్నాయి. వీటిని తెరవాలంటే కేంద్రం చెప్పిన 24 నిబంధనలను పాటించాలి. ఒక షో అయ్యాక మ‌రో షో ప్రారంభానికి ముందు శానిటైజ్‌ చేయాలంటే దానికి కొంత ఖర్చుతో పాటు థర్మత్‌స్కానర్లును కూడా కొనాలి. వీటన్నిటికి సుమారు 10 లక్షల ఖర్చు చేయాలని యాజమాన్యాలు చెబుతున్నాయి.

 

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో తాము ఇంత ఖ‌ర్చులు భ‌రించి థియేట‌ర్లు ఓపెన్ చేసే ప‌రిస్థితుల్లో లేమ‌నే అంటున్నారు. మ‌రి ఏపీ ప్ర‌భుత్వం వీరిని ఆదుకుంటుందా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news