దారుణాలకు, అత్యాచారాలకే అడ్రస్‌గా మారిపోయి యూపీలో మరో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు 15 ఏళ్ల వయస్సు కల బాలికను ఎత్తుకు వెళ్లి.. అక్కడ ఆమెకు మత్తు మంది ఇచ్చి మరీ అత్యాచారం చేశారు. వీరిద్దరు ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేస్తుంటే దానిని వీడియో కూడా తీశారు. ఈ దారుణ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది.
మీరట్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె బంధువులు అయిన ఇద్దరు యువకులు పని ఉందని ఓ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ మత్తు మందు ఇవ్వడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ కోల్పోయిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశారని ఏఎస్పీ సూరజ్ రాయ్ చెప్పారు.
ఇక బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆమెపై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇక జిల్లా ఎస్పీ విజయ్ ధుల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహం పోస్టుమార్టం తర్వాత చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయ్ చెప్పారు.