అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌కు రోజు రోజుకు ప్రజదారణ పెరగుతున్నట్టు సర్వేలు చెపుతున్నాయి. ఈ సర్వేలను బట్టి చూస్తే వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్షడు అవ్వాలనుకుంటోన్న ట్రంప్ ఆశలు అడియాసలు అయ్యేలా ఉన్నాయి. అమెరికన పౌరుల్లో ట్రంప్ పట్ల రోజు రోజకు వ్యతిరేకత పెరుగుతోంది. తాజా సర్వేలను బట్టి చూస్తే ట్రంప్ కన్నా ప్రత్యర్థి బైడెన్ ప్రజాదరణలో 7 నుంచి 8 శాతం ఆధిక్యతలో ఉన్నారట.
ఈ సర్వేలతో ట్రంప్ శిబిరంలో గుబులు స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందనే అమెరికన్ పౌరులు విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు ఒబామా కేర్ రద్దు చేయడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఇక దేశంలో తీవ్రంగా పెరిగిపోతోన్న నిరుద్యోగిత.. ప్లాయిడ్ ఉదంతంతో నల్లజాతీయుల్లో అభద్రతా భావం పెరగడంతో పాటు దేశంలో ఉన్న ముస్లింలు సైతం బైడెన్ వైపే మొగ్గు చూపుతున్న పరిణామాలు ట్రంప్‌కు పెద్ద మైనస్‌గా మారాయి.
అయితే ట్రంప్ మాత్రం బైడెన్ గెలిచినా రెండు నెలల ముచ్చటగానే మిగులుతుందంటూ కొత్త పల్లవి అందుకన్నారు. బైడెన్ గెలిచినా ఆ పదవిని ఆ తర్వాత కమలా హ్యారిస్ లాక్కుంటారని ట్రంప్ ట్వీట్స్ సైతం చేశారు. ఓ వైపు కరోనా సోకిన తర్వాత కూడా ట్రంప్… పూర్తిగా కోలుకోకుండానే కారు షికారు చేయడం కలకలం రేపింది.