ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తాని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతిని బలవంతంగా తిరుపతి రప్పించి అక్కడ ఆమెను వ్యభిచార కూపంలోకి దించాలని చూశారు. అయితే చివర్లో ఆ యువతి వారి నుంచి ఎలాగోలా తప్పించుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతికి తిరుపతికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.
ఆ యవతి తనకు ఉద్యోగం కావాలని చెప్పడంతో సదరు యువతి ఖమ్మం నుంచి తిరుపతి వచ్చేందుకు అంగీకరించింది. ఖమ్మం నుంచి కారును బుక్ చేసి తిరుపతి వస్తుండగా మార్గమధ్యంలో కరకంబాడీ దగ్గర మరో ఇద్దరు మహిళలు కూడా కారులో ఎక్కారు. వారిద్దరు ఆ యువతిని బలవంతంగా వ్యభిచారం చేయాలని చెప్పడంతో ఆ యువతి అందుకు ఒప్పుకోలేదు.
అయితే ఆమెకు బలవంతంగా మద్యం తాగించి ఆమెను వ్యభిచార కూపంలోకి దింపాలని ప్లాన్ చేయడంతో పాటు కొట్టారు. అయితే గాయాలతోనే ఆ యువతి అక్కడ నుంచి తప్పించుకుని రుయా ఆసుపత్రికి వచ్చేసింది. అక్కడ నుంచి కూడా ఆ ముఠా ఆ యువతిని బలవంతంగా తీసుకు పోవాలని చూశారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆమెను రక్షించారు.