వరకట్న వేధింపులు అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు తప్పడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే ఇవి సామాన్యులకే కాదు ఏకంగా ఎమ్మెల్యేల కూతుళ్లకు కూడా తప్పని పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఏకంగా ఓ ఎమ్మెల్యే కూతురు వరకట్న వేధింపులకు గురైంది. విజయ్‌పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసి కుమార్తెను అదే జిల్లాలోని మయపూర్‌కు చెందిన ఆదివాసికి ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు.
మూడేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత ఆదివాసి వరకట్నం కోసం ఎమ్మెల్యే కుమార్తె అయిన తన భార్యను తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. పుట్టింటి నుంచి ఖరీదైన బైకు, లక్షల్లో నగదు తీసుకురావాలని రోజు హింసిస్తున్నాడు. ఆమె ఆడపడుచు, మరుదులు, అత్తమామలు కూడా ఆమెను వరకట్నం కోసం వేధిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే సీతారాం ప్రతిసారి కుమార్తె ఇంటికి వెళ్లి ఆమె అత్త మామలకు సర్ది చెపుతున్నాడు.
నాలుగు నెలల క్రితం ఎమ్మెల్యే సీతారాం అనారోగ్యానికి గురి కావడంతో ఆమె చూసేందుకు వచ్చింది. అయితే భర్త ఆమెను అదనపు కట్నం తెస్తేనే తిరిగి రావాలని.. లేకుంటే వద్దని చెప్పేశాడు. దీంతో నాలుగు నెలల పాటు వెయిట్ చేసిన బాధితురాలు అత్తింటి నుంచి ఎలాంటి కబుర్లు లేకపోవడంతో వారిపై వరకట్న వేధింపులు, గృహహింస నేరాల కింద కేసులు పెట్టింది.
తన ఫిర్యాదులో భర్తతోపాటు అత్త, మామ, బావ, మరుదులను కూడా ప్రతివాదులుగా చేర్చింది. ఏదేమైనా ఎమ్మెల్యే కుమార్తెకే వరకట్న వేధింపులు తప్పలేదంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ? అర్థం చేసుకోవచ్చు.