ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఇప్పటికే అనేక సందేహాలు అందరికి ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో గాలి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని తేలింది. ఇప్పటి వరకు గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా ? లేదా ? అన్న విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. అయితే అమెరికా సంస్థ అయిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చేసిన అధ్యయనంలో గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి ఉంటుందని తేలింది.
కరోనా రోగి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలవడే తుంపర్లలో వైరస్ ఉంటుంది. ఈ వైరస్ గాలి ద్వారా ప్రయాణిస్తుందని.. వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించకపోతే ఇది మరింతగా వ్యాప్తి చెందుతుందని కూడా ఈ అధ్యయనం చెప్పింది. అయితే వైరస్‌లో ఉన్న బలాన్ని బట్టి అది ఆరు అడుగుల దూరం కంటే ఎక్కువే ప్రయాణిస్తుందని కూడా ఈ అధ్యయనం వివరించింది.
ఇక ఇప్పటి వరకు గాలి ద్వారా కూడా కరోనా ప్రయాణిస్తుందని, వ్యాపిస్తుందన్న విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ విషయంలో కొందరు ఓకే చెప్పగా మరి కొందరు ఇలా జరగదన్నారు. తాజాగా మరో అధ్యయనం ఈ విషయంలో గాలిలో కూడా కరోనా ప్రయాణిస్తుందని.. వ్యాపిస్తుందని స్పష్టం చేయడంతో గాలితో కరోనా వ్యాప్తి అన్న విషయానికి మరింత బలం చేకూరినట్లయ్యింది.