హైదరాబాద్లో కడప గ్యాంగ్ రచ్చ చేసింది. అచ్చం సినిమా స్టైల్లో చూపించినట్టుగా ఓ నిర్మాతను కిడ్నాప్ చేసింది. సినిమా స్టైల్లో కార్ ఆగడం, మనిషిని లాక్కుని కార్లో ఎక్కించుకోవడం ఆ వెంటనే అక్కడ నుంచి మాయం కావడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. బంజారాహిల్స్లో సినీ స్టైల్లో జరిగిన ఈ కిడ్నాప్ ఇప్పుడు టాలీవుడ్లో కలకలం రేపుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కొడుకు కొండా రెడ్డి నానా రచ్చ రచ్చ చేశారు.
సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శివగణేష్ను కొండా రెడ్డి అతడి అనుచరులు సినీ పక్కీలో కిడ్నాప్ చేసి క్షణంలో మాయం అయ్యింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శామీర్పేటతో పాటు కడప జిల్లాకు సంబంధించిన భూముల పత్రాల కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. పక్కనే ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెపుతోన్న దాని ప్రకారం కొండా రెడ్డితో పాటు కొందరు అనుచరులు తుపాకులు, కత్తులు చూపించి మరీ శివగణేష్ను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ కిడ్నాప్ గ్యాంగ్ శివగణేష్ను వదిలేశాక అతడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.