కరోనా నేపథ్యంలో మార్చి చివరి వారం నుంచి దేశంలో లాక్‌డౌన్ చాలా పగడ్బందీగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ అమలు అవుతోన్నప్పటి నుంచి దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతోంది. కన్స్యూమర్ పిరిమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వే లెక్కల ప్రకారం మే – ఆగస్టు మధ్యలో మొత్తం 66 లక్షల వైట్ కాలర్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయినట్టు వెల్లడైంది.
ఇంతమంది నిపుణులు ఉద్యోగాలు కోల్పోవడం అంటూ మామూలు విషయం కాదు. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, అక్కౌంటెంట్లు ఉన్నారు. ఇక గతేడాదిలోనే ఎక్కువమంది వైట్ కాలర్ నిపుణులు ఉద్యోగాల్లో చేరగా.. ఇప్పుడు వారిలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.