Exclusive review of Megastar Chiranjeevi’s milestone 150th movie ‘Khaidi no 150’. This film directed by VV Vinayak and produced by Ram Charan under ‘Konidela Productions Company’ banner. Kajal Agarwal played lead female role and Tharun Arora as antagonist.
సినిమా : ఖైదీ నెంబర్ 150
నటీనటులు : చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, ఆలీ, బ్రహ్మానందం, తదితరులు
దర్శకుడు : వివి వినాయక్
నిర్మాత : రామ్ చరణ్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : రత్నవేలు
ఎడిటర్ : గౌతమ్ రాజు
బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
సెన్సార్ సర్టిఫికెట్ : యూ/ఏ
రిలీజ్ డేట్ : 11-01-2017
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్న తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి మైల్‌స్టోన్ 150వ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ సమయం ఎట్టకేలకు రానే వచ్చేసింది. ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. వివి వినాయక్ దర్శకత్వంలో ‘కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ’ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రంపై మొదటినుంచి తారాస్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఇక ట్రైలర్‌లో చిరు తన మునుపటి స్టామినానే చూపించడంతో.. సినిమాలోనూ అదే సత్తా చూపించి, తన పూర్వవైభవం చాటుకుంటాడని, పాత రికార్డులకు పాతరేసి కొత్తి రికార్డుల జాతర పట్టడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు. మరి.. ఆ అంచనాల్ని అందుకోవడంలో మెగాస్టార్ సఫలమయ్యాడా? లేదా? తెలియాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ :
ఒక ఖైదీ జైలు నుంచి పారిపోతాడు. అతను ఎలా పరారయ్యాడన్న విషయాన్ని ఓ మ్యాప్ వేసి, అతడ్ని పట్టించడంలో సహాయం చేస్తానని ‘ఖైదీ 150’ (చిరంజీవి) పోలీసులను నమ్మిస్తాడు. అన్నట్లుగానే అతడ్ని పట్టిస్తాడు కానీ.. మనోడు పరారవుతాడు. అలా జైలు నుంచి తప్పించుకుని వచ్చిన అతను.. చిల్లర దొంగతనాలు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు.
కట్ చేస్తే.. కొన్నికార్పొరేట్ సంస్థలకు అధిపతి అయిన తరుణ్ అరోరా ఓ ఫ్యాక్టరీ కోసం ఓ గ్రామంలోని రైతుల భూముల్ని లాక్కోవాలని ప్రయత్నిస్తుంటారు. వాటిమీదే ఆధారపడి బ్రతుకుతున్న రైతులకు అన్యాయం జరగకూడదని, తరుణ్ ప్రయత్నాలకి విరుద్ధంగా శంకర్ (చిరంజీవి) అనే యువకుడు పోరాటం మొదలుపెడతాడు. ఓరోజు శంకర్‌కి అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. అదే ప్లేస్‌లో ఖైదీ ఉంటాడు. దగ్గరకొచ్చి చూడగా.. తన పోలికలతో ఉన్న శంకర్‌ని చూసి అతను ఖంగుతింటాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అయితే.. శంకర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఖైదీ తెలుసుకుని, అతని పేరు మీద డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. అందుకు ప్లాన్ రెడీ చేసుకుని, శంకర్ గ్రామానికి వెళతాడు ఖైదీ.
అక్కడికి వెళ్లిన తర్వాత ఆ గ్రామంలోని సమస్యలు తెలుసుకుంటాడు. అయినా.. అవేమీ పట్టించుకోకుండా ఎలాగోలా డబ్బులు దొబ్బేయాలనే ప్లాన్ చేస్తాడు. కానీ.. ఆ గ్రామంలోని రైతులు చూపించే ప్రేమను, వాళ్లు పడుతున్న అవస్థలు చూసి.. వారికి న్యాయం చేయాలని పూనుకుంటాడు. అప్పుడు ఖైదీ తన తెలివిగా కొన్ని ప్రణాళికలు రచిస్తాడు. భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న తరుణ్‌కి చుక్కలు చూపించడం మొదలుపెడతాడు. మరి.. ఆ పోరాటంలో ఖైదీ గెలుపొందాడా? ఇంతకీ అతను వేసిన ఎత్తుగడలు ఏంటి? ఆసుపత్రిలో ఉన్న శంకర్ ఏమయ్యాడు? కాజల్ ఎవరు? ఖైదీ ప్లాన్లకు ఎదుర్కోవడానికి తరుణ్ పన్నిన పన్నాగాలేంటి? చివరికి ఏమైంది? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
విశ్లేషణ :
ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. రైతుల భూముల కోసం ఓ యువకుడు పోరాడే థీమ్‌తో సాగే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుకూలంగా దర్శకుడు వివి వినాయక్ బాగానే తెరకెక్కించారు. చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి.. ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. బాస్ ఈజ్ రియల్లీ బ్యాక్ అనే తరహాలో ఆయనతో స్టెప్పులు, యాక్షన్ సీన్లు అద్భుతంగా చేయించాడు. తమిళంలో కంటే కథనం వేగంగా, ఇంట్రెస్టింగ్‌గా కథని నడిపించాడు.
కథ విషయానికొస్తే.. ఈ సినిమా స్టార్టింగే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జైలు నుంచి ఖైదీ చాకచక్యంగా తప్పించుకునే అంశం ఆడియెన్స్‌లో ఉత్సాహం నింపుతుంది. అనంతరం వచ్చే ‘రత్తాలు’ ఐటమ్ సాంగ్ బాగుంది. లక్ష్మీరాయ్ తన ఒంపుసొంపుల వయ్యారాలతో కట్టిపడేస్తే.. బాస్ తన క్లాస్ డాన్స్‌లో మాస్ మిక్స్ చేసి అదరగొట్టేశాడు. ఆ తర్వాత ఖైదీతో కాజల్‌కి మధ్య లవ్ ట్రాక్, కామెడీ ఎపిసోడ్‌లతో సరదాగా సాగుతుంది. కాజల్, చిరుకి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్స్ కూడా బాగున్నాయి. కాజల్ అందంగా కనిపిస్తూనే.. చిరుతో సమానంగా స్టెప్పులు వేసింది. ఇక శంకర్‌కి యాక్సిడెంట్ అయ్యాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి సినిమా ఆసక్తికరంగా, మరింత వేగంగా నడుస్తుంది. మధ్యమధ్యలో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ ఆడియెన్స్‌ని కడుపుబ్బా నవ్వంచాయి. యాక్షన్ సీన్లు సైతం బాగా కుదిరాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఈ సినిమాకే హైలైట్. అక్కడొచ్చే కాయిన్ ఫైట్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళుతుంది.
ఇక సెకండాఫ్ కూడా రసవత్తరంగానే సాగుతుంది. విలన్‌కి వ్యతిరేకంగా రైతులతో ఖైదీ కలిసి వేసే ప్లాన్స్ ఆకట్టుకుంటాయి. సిటీలో వాటర్ పంపుల్ని బ్లాక్ చేసే ప్లాన్ అయితే మైండ్‌బ్లోయింగ్. ఆ టైంలో విజిల్స్‌తో థియటేర్లు మోత మోగాల్సిందే. ఇలా హీరో వేసే ప్లాన్స్, వాటిని విలన్ ఎదుర్కొనేందుకు వేసే ఎత్తుగడలతో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ఇక క్లైమాక్స్.. అందరి అంచనాలకు తగ్గట్టుగానే అదిరిపోయే రేంజ్‌లో ఉంది. అక్కడొచ్చే ట్విస్ట్ భలే కిక్ ఇస్తుంది. ఓవరాల్‌గా.. సినిమా మొత్తం చాలా బాగా వచ్చింది.
అయితే.. ఫస్టాఫ్‌లో కాసేపయ్యాక వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడ ఏదో మిస్ అవుతున్న ఫీల్ కలుగుతుంది. పరమ రొటీన్ సన్నివేశాలు కాస్త బోర్ ఫీల్ తెప్పిస్తాయి. చిరు, కాజల్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. రైతుల కోసం పోరాడే శంకర్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే వరకు సినిమా కాస్త స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. తమిళ ‘కత్తి’తో పోల్చుకుంటే.. కొన్నిచోట్ల ఒరిజినాలిటీ మిస్ అయ్యింది. ‘ఠాగూర్’ తర్వాత మరో రీమేక్ కోసం కలిసిన చిరు, వినాయక్.. ఆ మేజిక్‌ని రిపీట్ చేయలేకపోయారు కానీ, ఫర్వాలేదనిపించారు. ఫైనల్‌గా.. ఈ చిత్రం ఫ్యాన్స్‌కి ట్రీట్.
నటీనటుల పనితీరు :
ముందుగా మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడితే.. తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా ఆయనలో ఆ పాత గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. అదే స్టైల్, ఎనర్జీ, నటనా ప్రతిభతో తన సత్తా చాటుకున్నారు. 62 ఏళ్ల వయసులోనూ డ్యాన్సుల్లో, యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసేశారు. ఏ అంచనాలైతే ఆడియెన్స్ పెట్టుకున్నారో.. వాటికి ఏమాత్రం తీసిపోకుండా చిరు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించారు. తన ‘మెగాస్టార్’ ట్యాగ్‌లైన్ సరైన న్యాయం చేకూర్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తన భుజాలమీదే ఈ చిత్రాన్ని నడిపించారు. ఇక హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ ఎప్పట్లాగే తన అందచందాలతోపాటు, నటనతోనూ ఆకట్టుకుంది. చిరుకి తగ్గ జోడీగా నటనాప్రతిభ కనబరిచింది.
అయితే.. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన తరుణ్ అరోరా విలన్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. నిజానికి.. హీరో తర్వాత సినిమాలో మెయిన్ పిల్లర్ అయిన క్యారెక్టర్‌లో నటించిన తరుణ్.. దానికి పూర్తి న్యాయం చేయలేకపోయాడు. హీరోకి ధీటుగా విలనిజం పండించడంలో ఫెయిల్ అయ్యాడు. పసలేని యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ని నిరాశపరిచేశాడు. బ్రహ్మానందం, ఆలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, ఇతర కమెడియన్స్ ఆడియెన్స్‌ని నవ్వించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇతర నటీనటులు తమతమ పాత్రలకు సరైన న్యాయం చేశారు.
చివరగా మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసే స్టెప్స్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం కుమ్మి పడేసారంతే..
సాంకేతిక పనితీరు :
రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీకి ఎన్ని మార్కులు వేసినా తక్కువ. హీరోని ఎలివేట్ అయ్యేలా చూపించడంలోనూ, ప్రతి ఫ్రేమ్‌ని కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా చూపించడంలో తన టాలెంట్ ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్న రత్నవేలు.. ఈ మూవీలోనూ తన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నాడు. ఇక రాకింగ్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. మూడ్‌కి తగ్గట్టు స్కోర్ ఇచ్చాడు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ బాగున్నాయి. రాంచరణ్ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు.
ఇక దర్శకుడు వినాయక్ గురించి మాట్లాడితే.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిరు ఇతనిపై ప్రశంసల వర్షం ఎందుకు కురిపించారో.. సినిమా చూశాక అర్థం అవుతుంది. జనాలు ఏదైతే కోరుకున్నారో.. ఆ ఔట్‌పుట్ రాబట్టడంలో పాసయ్యాడు. అయితే.. మధ్యమధ్యలో ఉన్న ఫ్లాస్‌పై కాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.
ఫైనల్ వర్డ్ : బాస్ ఈజ్ బ్యాక్ … రికార్డులు షేక్!!
‘ఖైదీ నెంబర్ 150’ మూవీ రేటింగ్ : 3.5/5