శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో తీగలాగిన కొద్ది అనేక సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో దక్షిణాఫ్రికా దేశస్తులే ప్రధాన సూత్రధారులు అని కొత్తగా సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితమే అరెస్టు చేశారు. ఈ పెప్పర్ చెప్పిన దాని ప్రకారం బెనాల్డ్ ఉడేన్నా అనే ఆఫ్రికన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు కన్నడ సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలకు తామే మత్తు పదార్థాలు సరఫరా చేసుకున్నట్టు ఒప్పుకున్నారు.
ఇక ఉడేన్నా ఇదిత్య ఆళ్వాకు చాలా సన్నిహితుడు.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రవిశంకర్ వీరేన్ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవారని తెలిసింది. ఈ గ్యాంగ్ బెంగళూరుతో పాటు చుట్టు పక్కల ఉండే రిసార్టుల్లో జరిగే పార్టీలకు, రేవ్ పార్టీలకు భారీ ఎత్తున మత్తు పదార్థాలు సరఫరా చేసినట్టు కూడా తెలుస్తోంది.
ఈ ఆఫ్రికా దేశస్తులను అరెస్టు చేస్తోన్న క్రమంలోనే ముగ్గురు కింగ్‌పిన్ లు పరారు కావడంతో కేసుపై సీసీబీ ఈ కేసును చాలా సీక్రెట్‌గా విచారిస్తోంది. ఈ ముగ్గురు కింగ్పిన్లే హీరోయిన్లు సంజన, రాగిణిలతో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్టు సీసీబీ వర్గాలు చెప్పాయి. ఇక మత్తు పదార్థాలకు సంబంధించి ఎవరు ఎంత సరఫరా చేశారు ? అన్నదానికి సంబంధించి సంజన ఇంట్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయట. ఆదిత్య ఆళ్వ విదేశాల కు పారి పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.