అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రపంచ రాజనీతి మేథావిగా పేరొందారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే పరిపాలించబడే ప్రభుత్వాన్న ప్రజాస్వామ్యం అంటారని నిర్వచించారు. తాజాగా ఆయన తల వెంట్రుకలు, రక్తం మరకలతో ఉన్న ఓ టెలిగ్రామ్ వేలం వేయగా ఓ వ్యక్తి వాటిని 81వేల డాలర్లు (దాదాపు రూ. 60 లక్షలు)కు సొంతం చేసుకున్నాడు.
లింకన్ 1865 ఏప్రిల్ 15న హత్యకు గురయ్యాడు. ఆ టైంలో పోస్టుమార్టం చేయగా అందుకోసం రెండు అంగుళాల పొడవు ఉన్న తల వెంట్రుకలు కత్తిరించి పరీక్ష చేశారు. పోస్టుమార్టం తర్వాత వాటిని లింకన్ భార్య మ్యారిటోడ్ లింకన్ సోదరుడు డాక్టర్ లిమన్ బీచర్‌టోడ్‌కు అప్పగించారు. వెంట్రుకలు ఇచ్చినప్పుడు వాటిని తీసుకునేందుకు తన జేబులో ఉన్న ఓ టెలీగ్రామ్ తీసి అందులో చుట్టి జాగ్రత్త పరిచారు.
దీనిపై లింకన్ తల వెంట్రుకలు అని రాసి పెట్టారు. ఇటీవల వాటిని వేలం వేయగా ఓ వ్యక్తి రు. 60 లక్షలకు కొన్నాడు. లిమన్ భద్రపరిచిన తలవెంట్రుకల గురించి ఆయన కుమారుడు జేమ్స్ టాడ్ 1945 ఫిబ్రవరి 12న వివరాలను వెల్లడించారు.