జపాన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకి అక్కడ ముత్తు నుంచి అక్కడ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. రజనీ సినిమా వస్తుందంటే అక్కడ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఇక రజనీ తర్వాత అక్కడ ఆ రేంజ్లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాలను అనుకరిస్తూ వారు ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటారు. ఈ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయ్యాయి.
తాజాగా ఎన్టీఆర్ – హన్సిక నటించిన కంత్రి సినిమాలోని వయస్సునామి పాటకు ఓ జపనీస్ జంట డ్యాన్స్ చేసింది. మామూలుగా ఇంట్లో పనులు చేసుకుంటున్నట్టుగా ఈ డ్యాన్స్ షూట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్‌లోని హెరో మునియోరులో కాస్ట్యూమ్ డిజైనర్, ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తూ ఉంటాడు. మనోడు ఎన్టీఆర్ అంటే పడిచస్తాడు. ఈ పాటకు అతడి పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా డ్యాన్సులు వేశారు.
ఈ జంటే గతంలో అశోక్ సినిమాలోని గోల గోల రంగోలా పాటకు కూడా డ్యాన్సులు చేసింది. సింహాద్రిలోని చీమ చీమ పాటకు కూడా స్టెప్పులు వేశారు. జపాన్‌లో జూనియర్‌కు మామూలుగా అభిమానులు లేరు. ఇక జనతా గ్యారేజ్షూటింగ్ టైంలో ఓ జపాన్ అభిమాని ఎన్టీఆర్‌తో ఫొటో తీయించుకున్నాడు.