ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జెమినీ ఛానెల్లో చక్రవాకం సీరియల్ అప్పట్లో పెద్ద పాపులర్. మంజులా నాయుడు ఈ సీరియల్‌కు దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ వస్తుందంటే అప్పట్లో ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయేవారు. ఈ సీరియల్ హీరో ఇంద్రనీల్ వర్మ అలియాస్ ధర్మ బుల్లితెరపై ఎంతో మంది మహిళల కలల రాకుమారుడు అయ్యాడు. చాలా రోజుల తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ మాట్లాడుతూ తన జీవితంలో కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.
ఈ సీరియల్ షూటింగ్ టైంలోనే ఇంద్రనీల్ సీరియల్లో హీరోయిన్ తల్లిపాత్రలో నటించిన మేఘనా రామితో ప్రేమలో పడి ఆమెనే పెళ్లాడాడు. చక్రవారం సీరియల్లో తనకు అత్తగా నటించిన అమ్మాయినే పెళ్లాడడంతో కొందరు అత్తను పెళ్లి చేసుకున్నాడని సెటైర్లు వేశారట. అప్పల్లో ఆమె కాస్త లావుగా ఉండడంపై కూడా కొందరు ఎద్దువా చేశారట. అయితే మేఘనా రామి లాంటి భార్య దొరకడం తన అదృష్టమని ఇంద్రనీల్ చెప్పాడు.
ఇదిలా ఉంటే మేఘన ప్రస్తుతం ఎనిమిది పాపులర్ సీరియల్స్‌లో నటిస్తోంది. జీ తెలుగులో వస్తోన్న రాధమ్మ కూతురు సీరియల్లో హీరోయిన్ తల్లి పాత్రలో కూడా నటిస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు ఇంద్రనీల్ – మేఘనా రామి జంటను చూసి హేళన చేసిన వారే ఇప్పుడు వారి అన్యోన్య దాంపత్యం చూసి ముక్కు వేలేసుకుంటున్నారు.