Newsబంగారం రేటుకు బ్రేకుల్లేవ్‌.... డాల‌ర్ దెబ్బ‌తో ఉరుకులు ప‌రుగులే

బంగారం రేటుకు బ్రేకుల్లేవ్‌…. డాల‌ర్ దెబ్బ‌తో ఉరుకులు ప‌రుగులే

ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డంతో సోమ‌వారం దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. ఓ వైపు డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ బ‌లహీన‌ప‌డింది. దీంతో బంగారం మ‌దుపరుల నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రేటు రు. 101 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు 51,420 కు చేరుకుంది.

 

 

ఇక వెండి రేటు కూడా పెరిగింది. వెంటి రేటు కేజీ రు. 247 పెరిగి 68,175 రూపాయలకు ఎగబాకింది. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్ల ప‌త‌నం కూడా బంగారంకు క‌లిసొచ్చింది. అమెరికన్‌ కరెన్సీ డాలర్‌ బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్స్‌కు 1960.50 డాలర్లకు పెరిగింది. ఏదేమైనా బంగారం రేటు రోజు రోజుకు ఉరుకులు ప‌రుగులే పెడుతోంది. ఈ ప‌రుగుల‌కు ఎప్ప‌ట‌కి బ్రేక్ ప‌డుతుందో ?  చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news