ప్రపంచ మహమ్మారి కరోనా ఎప్పుడు వదులుతుందో ? ఎప్పుడు ప్రజలు అందరూ ఈ మహమ్మారి నుంచి సేఫ్ అవుతారో ? తెలియడం లేదు. తాజాగా కలియుక దైవం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రోజుల పాటు టీటీడీ ఆలయంలో దర్శనాలు లేవు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేయడంతో తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు.
ఇక టీటీడీ వారు కూడా భౌతికదూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా దర్శనాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయినా కూడా కరోనా అక్కడ జోరు చూపిస్తోంది. గతంలో ఆలయ ప్రధాన అర్చకులతో పాటు పలువురు అర్చకులు కరోనా భారీన పడ్డారు. ఇక ఇప్పుడు ఆలయ సిబ్బంది, అర్చకులకు భారీ స్థాయిలో కరోనా సోకడంతో భక్తులు సైతం ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు వచ్చాయి.
ఇప్పటి వరకు కరోనా భారిన పడ్డ టీటీడీ ఉద్యోగుల సంఖ్య 1572కు చేరింది. వీరిలో 1403 మంది వైరస్ నుంచి కోలుకోగా 169 మంది చికిత్సలో ఉన్నారు. ఐదుగురు ఉద్యోగులు మృతి చెందారు. దీంతో ప్రస్తుతం టీటీడీలో ఆర్జిత సేవలు రద్దు చేశారు.