జనతా గ్యారేజ్ విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు అవుతాయి అని ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. అయితే మనకి అందిన సమాచారం ప్రకారం తెలుగు మరియు మలయాళం బాషలలో ఈ సినిమా దాదాపుగా 2500 స్క్రీన్ లలో ప్రదర్శితమవుతోంది.
తెలుగు లైవ్స్ కి అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజున జనతా గ్యారేజ్ సినిమా దాదాపుగా 20 కోట్లకి పైగా వసూలు చేస్తుందని అంచనా. ఈ కలెక్షన్లు కానీ వస్తే మొదటి వారం లోనే 50 కోట్ల మార్కు ని దాటేయ్యడం పెద్ద సమస్య కాక పోవచ్చు. అయితే నైజామ్ లో మాత్రం వర్షం ఈ సినిమా కలెక్షన్లపై కొంత ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. బెనిఫిట్ షోలకి ఆంధ్రా మరియూ తెలంగాణా లో పెర్మిషన్లు దొరకడంతో అభిమానుల కోలాహలానికి అవధులు లేకుండా పోయింది.