Newsతెలంగాణ‌లో భారీ లంచావ‌తారుడు.. ఏకంగా రు. 1.12 కోట్ల లంచ్‌తో బుక్...

తెలంగాణ‌లో భారీ లంచావ‌తారుడు.. ఏకంగా రు. 1.12 కోట్ల లంచ్‌తో బుక్ అయ్యాడు

తెలంగాణ‌లో రోజు రోజుకు లంచావ‌తారులు పెరిగిపోతున్నారు. ప్ర‌జ‌ల సమ‌స్యలు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వ అధికారులు భారీ లాంచావ‌తారులుగా మారిపోతున్నారు. చేయి త‌డ‌ప‌నిదే ప్ర‌జ‌ల ప‌నులు కావ‌డం లేదు. మొన్న కీస‌ర మాజీ త‌హ‌సీల్దార్ నాగ‌రాజు లంచం విష‌యం మ‌ర్చిపోక‌ముందే ఈ రోజే మెద‌క్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ న‌గేష్ ఏకంగా 1.12 కోట్ల లంచ్ తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు సంబంధించి ఓ రైతుకు ఎన్వోసీ ఇవ్వ‌డానికి న‌గేష్ ఎక‌రాకు రు. ల‌క్ష డిమాండ్ చేశాడు.

దీంతో బుధ‌వారం రు. 1.12 కోట్లు చెక్ తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా బుక్ అయ్య‌డు. ఉదయం నుంచి మెదక్ పట్టణంలో నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. కింది స్తాయి సిబ్బంది త‌ప్పు చేస్తే స‌రి చేయాల్సిన క‌లెక్ట‌రే స్వ‌యంగా లంచం డిమాండ్ చేయ‌డంతో భారీ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏకంగా ఎడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ స్థాయి వ్య‌క్తి ఇంత భారీ మొత్తం లంచం డిమాండ్ చేయ‌డం ఇప్పుడు తెలంగాణ‌లో క‌ల‌క‌లం రేపుతోంది.

 

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఏసీబీ విచార‌ణ‌లో నగేష్.. లంచంగా కోటి 12 లక్షల డబ్బు, కోటి రూపాయల ప్రాపర్టీ కూడా నగేష్ రాయించుచున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. నగేష్‌ వ్యవహారంతో ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news