Moviesవ‌డ్డే న‌వీన్ నంద‌మూరి బాల‌కృష్ణ అల్లుడే... ఆ రిలేష‌న్ ఇదే..

వ‌డ్డే న‌వీన్ నంద‌మూరి బాల‌కృష్ణ అల్లుడే… ఆ రిలేష‌న్ ఇదే..

ప్ర‌ముఖ నిర్మాత వ‌డ్డే ర‌మేష్ కుమారుడే వ‌డ్డే న‌వీన్‌. విజ‌య‌మాధ‌వీ కంబైన్స్ బ్యాన‌ర్‌పై వ‌డ్డే ర‌మేష్ గ‌తంలో ఎన్నో భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించాడు. ఆ త‌ర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన న‌వీన్ పెళ్లి, చాలా బాగుంది, కోరుకున్న ప్రియుడు, మ‌న‌సిచ్చి చూడు, మా బాలాజీ లాంటి సినిమాల్లో న‌టించాడు. ఇదిలా ఉంటే న‌వీన్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి చాలా త‌క్కువ మందికే తెలుసు. న‌వ‌న్ నంద‌మూరి కుటుంబానికి అల్లుడు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ త‌న‌యుడు రామ‌కృష్ణ కుమార్తె చాముండేశ్వ‌రిని ముందుగా న‌వీన్ వివాహం చేసుకున్నాడు.

 

అయితే వీరి మ‌ధ్య స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడిపోయారు. ఈ వివాహాన్ని ఎన్టీఆరే కుదిర్చార‌ని కూడా అంటారు. ఇక వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల వల్లే న‌వీన్ సినిమా కెరీర్‌లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అలా చాముండేశ్వ‌రిని పెళ్లి చేసుకున్న న‌వీన్ నంద‌మూరి వార‌సులు అంద‌రికి అల్లుడు అయ్యాడు. ఆ త‌ర్వాత మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకున్న న‌వీన్ ఇప్పుడు త‌న ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవ‌ల న‌వీన్ కుమారుడు పంచెక‌ట్టు ఫంక్ష‌న్‌కు రోజాతో పాటు సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news