టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ సంతాపం వ్యక్తం చేశారు. అమిత్ షా గొప్ప ప్రతిభ ఉన్న తెలుగు నటుడు జయప్రకాశ్ రెడ్డి గారి మరణం నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది… ఆయన ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు సినిమాకు ఎంతో గొప్ప సేవ చేశారంటూ కొనియాడడంతో పాటు ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయన స్థానం భర్తీ చేయలేం.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం అని ట్విటర్లో పేర్కొన్నారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్టర్లో జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి అని ట్వీట్ చేశారు.