Politicsగ్రేట‌ర్ హైదారాబాద్ ఎన్నిక‌ల్లో ఆ టీడీపీ క్యాండెట్‌తో ట‌ఫ్ ఫైటేనా..!

గ్రేట‌ర్ హైదారాబాద్ ఎన్నిక‌ల్లో ఆ టీడీపీ క్యాండెట్‌తో ట‌ఫ్ ఫైటేనా..!

తెలంగాణలోనూ, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనూ టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిక‌పోయినా ఆ పార్టీ కేడ‌ర్ మాత్రం చెక్కుచెద‌ర్లేదు. తెలంగాణ‌లో మారుతోన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న టీడీపీని యాక్టివ్ చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో జ‌రిగే దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లోనూ, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో టీడీపీ ఇప్ప‌ట‌కీ బలంగానే ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన టీడీపీ, 2018 ఎన్నిక‌ల్లో ఓడినా భారీగా ఓట్లు తెచ్చుకుంది. ఇక గ్రేట‌ర్‌లో టీడీపీ బ‌లం ఏంటో 2019 లోక్‌స‌భ ఎన్నిక‌లే చెప్పాయి. గ్రేట‌ర్ చుట్టుప‌క్క‌ల ఉన్న ప్రాంతాలతో ఉన్న మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కేడ‌ర్ స‌పోర్ట్ కూడా ఎంపీ రేవంత్‌రెడ్డి గెలుపులో కీల‌క‌మైంది.

 

 

ఇక గ్రేట‌ర్లో ఇప్ప‌ట‌కీ నాయ‌కులు చాలా మంది పార్టీలు మారినా టీడీపీ కేడ‌ర్ చెక్కుచెద‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నాయ‌కులు పోటీకి రెడీ అవుతున్నారు. వీరిలో కొంద‌రు బ‌ల‌మైన కేడ‌ర్‌తో ఇక్క‌డ పార్టీల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించ‌నున్నారు. వీరు చీల్చే ఓట్లు ఖ‌చ్చితంగా ఇత‌ర పార్టీల త‌ల‌రాత‌ల‌ను మార్చుతాయ‌న‌డంలో సందేహం లేదు. గ్రేట‌ర్‌లో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కుత్బుల్లాపూర్ ఒక‌టి. సీమాంధ్ర ఓట‌ర్లు, టీడీపీ అభిమానులు బ‌లంగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన కుత్బుల్లాపూర్ ( 131 డివిజ‌న్‌) టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న అట్లూరి రాజేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున కార్పొరేట‌ర్‌గా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈ డివిజ‌న్‌లో పార్టీల‌తో సంబంధంలేకుండా గ‌త ప‌దేళ్లుగా విస్తృత‌మైన సేవా కార్య‌క్ర‌మాల‌తో ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నారు. గ‌తంలో ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండా ఎగ‌ర‌డంలో ఈ డివిజ‌న్‌లో రాజేష్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఎంతో మంది పార్టీలు మారినా, ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా కూడా రాజేష్ నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన ఈ డివిజ‌న్‌లో టీడీపీని ప‌టిష్టం చేస్తూనే వ‌స్తున్నారు.

 

 

త‌న వీరాభిమాని అయిన దివంగ‌త మాజీ మంత్రి, ప‌రిటాల ర‌వీంద్ర మొమోరియ‌ల్ ట్ర‌స్ట్ కుత్బుల్లాపూర్ శాఖ పేరుతో ప‌దేళ్ల‌కుపైగా సేవా కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తున్నారు. నిజాంపేట‌లో లేఅవుట్ల‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చినప్పుడు స్థానికంగా విస్తృత‌మైన సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు డివిజ‌న్‌లో విక‌లాంగుల‌కు వీల్‌చెయిర్లు, కుర్చీలు, వికులాంగుల పిల్ల‌ల‌కు పుస్త‌కాలు పంపిణీ, ర‌క్త‌దాన శిబిరాల‌తో పాటు స్థానికంగా ఎవ‌రికి ర‌క్తం అవ‌స‌రం అయిన వెంట‌నే స్పందించ‌డం, వృద్ధాశ్ర‌మాల్లోనూ అనాథ‌ల‌కు భోజ‌నాలు ఇలా ఎప్పుడూ సేవా కార్య‌క్ర‌మాల్లో రాజేష్ ముందు ఉంటున్నారు. ర‌క్త‌దాన శిబిరాలు చాలా చోట్ల జ‌ర‌గ‌డం కామ‌న్ అయినా రాజేష్ సేవ‌ల‌కు మెచ్చి నారా భువ‌నేశ్వ‌రి స్వ‌యంగా ఎన్టీఆర్ బ్ల‌డ్ బ్యాంక్ నుంచి మూడుసార్లు అవార్డు ఇచ్చారు.

 

 

రాజేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీలో చేరిక‌లు…

కుత్బుల్లాపూర్‌లో టీడీపీకి సంస్థాగ‌తంగా తిరుగులేని బలం ఉంద‌న్న విష‌యం మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది.  ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు అట్లూరి రాజేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ఇక మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ అశోక్‌కుమార్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో రాజేష్ స్థానికంగా పార్టీ బ‌లోపేతంలో దూసుకుపోతున్నారు. ఇక డివిజ‌న్‌లో స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల్లో ముందుంటున్నా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేస్తోన్న స‌మ‌యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌కుండా ముందుకు వెళుతున్నారు. ఇక రాజేష్ ఇక్క‌డ నుంచి కార్పొరేట‌ర్‌గా రంగంలో ఉంటే టీడీపీ ఖ‌చ్చితంగా ట‌ఫ్ ఫైట్ ఇస్తుంద‌న్న అంచ‌నాలు కూడా గ్రేట‌ర్‌లో ఉన్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news