కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేకు ఊహించని షాక్ తగిలింది. తెలుగులో నాగార్జున పక్కన మన్మథుడు 2, నిఖిల్ కిర్రాక్ పార్టీ వంటి సినిమాలతో పాటు పలు కన్నడ, తమిళ సినిమాల్లో సంయుక్త నటించింది. తాజాగా ఆమెపై పార్కులో దాడి జరిగింది. సంయుక్త స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులో డ్యాన్స్, వర్కవుట్స్ చేస్తోంది. ఆమెతో పాటు అక్కడ కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి అక్కడ డ్యాన్స్ వర్కవుట్లు చేస్తుండగా కవితా రెడ్డి అనే మహిళ సంయుక్తపై దాడి చేసింది.
కవితారెడ్డి సంయుక్తపై దాడి చేస్తుంటే అక్కడే ఉన్న కొందమంది పబ్లిక్ కూడా సపోర్ట్ చేశారు. పబ్లిక్‌గా పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని డ్యాన్సులు చేస్తారా ? మీ ఆర్టిస్టులు అందరూ డ్రగ్స్ వాడతారని అక్కడున్న వారు సంయుక్తతో పాటు అక్కడ ఉన్న వారిపై విరుచుకు పడ్డారు. ఈ ఘనటతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సంయుక్త తనపై జరిగిన దాడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అంతే కాకుండా తనపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆమె చెపుతున్నారు.